Begin typing your search above and press return to search.

బాబు ఢిల్లీ టూర్.. పట్టించుకోని జాతీయ నేతలు!

By:  Tupaki Desk   |   28 Oct 2018 8:48 AM GMT
బాబు ఢిల్లీ టూర్.. పట్టించుకోని జాతీయ నేతలు!
X
తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు స్పెషల్ ఇదే. తన అవసరానికి తగ్గట్టుగా - తన అవకాశవాదానికి తగ్గట్టుగా అక్కడ నేతలను కలుస్తూ ఉంటాడు. మొన్నటి వరకూ ఎన్డీయేలో చంద్రబాబు భాగస్వామి. మోడీ గ్రాఫ్ తగ్గాకా ఎన్డీయే నుంచి బయటకు వచ్చాడు. తను అడిగిన పనులు మోడీ చేసి పెట్టలేదని - సీట్లను పెంచలేదనే కోపంతోనే బాబు ఎన్డీయే నుంచి బయటకు వచ్చాడు. అప్పటి నుంచి మోడీ మోసం చేశాడని పాట పాడుతున్నాడు.

మొన్నటి వరకూ అదే మోడీకి సాగిలపడ్డాడు. మోడీ మంచోడని - మళ్లీ ప్రధాని కావాలని అన్నాడు. ఈ మేరకు ఎన్డీయే సమావేశంలో తీర్మానాన్ని ప్రవేశపెట్టింది కూడా చంద్రబాబు నాయుడే. అయితే ఇప్పుడు బాబు లెక్కలు మారిపోయాయి. అందుకే వ్యూహాత్మకంగా మోడీ వ్యతిరేక వర్గాన్ని కలవడానికి బాబు ప్రాధాన్యతను ఇచ్చాడు. అయితే బాబు అవకాశవాద రాజకీయాలు ఢిల్లీ నేతలకు ఏమీ తెలియనివి కావు కదా!

మొన్నటి వరకూ బాబు ఢిల్లీకి వస్తే తమను పట్టించుకునే వాడు కాదనేది ఈ నేతలకు తెలియనిది ఏమీ కాదు. అప్పుడు కేంద్రమంత్రులు - వెంకయ్య నాయుడు - రాజ్ నాథ్ సింగ్ వంటి వాళ్ల దర్శనానికి బాబు పోటీలు పడే వాడు. వారి అపాయింట్ మెంట్ కోసం ప్రయత్నించేవాడు. బీజేపీ ముఖ్య నేతలను - కేంద్ర మంత్రులను కలిసి వారికి శాలువాలు కప్పి తిరుపతి ప్రసాదాలు ఇచ్చి వచ్చేవాడు. వాళ్లతో అది చర్చించా ఇది చర్చించా అంటూ మాట్లాడేవాడు.

అయితే ఇప్పుడు రివర్స్ లో బీజేపీ నేతలను పక్కన పెట్టి మోడీ వ్యతిరేకులను కలిసి వచ్చాడు. అయితే ఇలా అవకాశవాదంతో ఒక్కోసారి ఒక్కోలా వ్యవహరించే నేతలను ఎవరూ పట్టించుకోరని చెప్పనక్కర్లేదు. చంద్రబాబును చూసి ఢిల్లీ నేతలు కూడా ఇదే అనుకున్నారట. బాబు ఇప్పుడేమో వచ్చాడని.. రేపు మళ్లీ అవసరం లేకపోతే - అజెండాను మార్చేసి మరో వైపు వెళ్లిపోయే అవకాశవాది ఇతను.. అనే చర్చ వారి మధ్యన జరిగిందని సమాచారం.

ఇక ఢిల్లీ వరకూ వెళ్లిన చంద్రబాబు నాయుడు అక్కడ తన రాజకీయ అవకాశవాదాన్ని చాటుకున్నాడు. కానీ రాష్ట్ర ప్రజలు మాత్రం గుర్తుకు రాలేదు - కనీసం తుఫాన్ సాయం గురించి కూడా కేంద్రాన్ని బాబు గట్టిగా డిమాండ్ చేయలేదు.