Begin typing your search above and press return to search.
ఢిల్లీలో చంద్రబాబు గేమ్ వర్కవుట్ అవుతుందా?
By: Tupaki Desk | 9 May 2019 11:40 AM GMTపదే పదే రాహుల్ గాంధీని కలవడం. ఆయనతో సమావేశం అయినట్టుగా అనుకూల మీడియాతో వార్తలు వేయించుకోవడం.. ఇదీ తెలుగుదేశం అధినేత - ఏపీ సీఎం చంద్రబాబు నాయుడి కొత్త స్ట్రాటజీ అని అంటున్నారు పరిశీలకులు. తను రాహుల్ గాంధీకి అత్యంత దగ్గరి వాడు అన్నట్టుగా చంద్రబాబు నాయుడు వ్యవహరించడానికి ప్రయత్నిస్తూ ఉన్నారని వారు అంటున్నారు. చంద్రబాబు నాయుడు ఇదంతా వ్యూహాత్మకంగా చేస్తూ ఉన్నారని.. ఢిల్లీలో చంద్రబాబు నాయుడు ఈ కొత్త గేమ్ ను ఆడుతూ ఉన్నారని, ఇది ఎంత వరకూ వర్కవుట్ అవుతుందో అని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. రాష్ట్ర స్థాయిలో ఫలితాలు తేడా కొడితే ఢిల్లీలో అయినా పట్టు సాధించుకోవాలనేది చంద్రబాబు వ్యూహమని పరిశీలకులు అభిప్రాయపడుతూ ఉన్నారు. అందుకు ఇప్పుడు బాబుకు ముందున్న మార్గం కాంగ్రెస్ పార్టీనే అని స్పష్టం అవుతోంది. భారతీయ జనతా పార్టీని తిడుతూ చంద్రబాబు నాయుడు ఇప్పుడు చాలా ముందుకు వచ్చారు. ఎన్నికల ముందంతా అదే అజెండా గా చేసుకుని బాబు ఏపీలో ప్రచార పర్వాన్ని కొనసాగించారు.
అదే సమయంలో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలప్పటి నుంచి కాంగ్రెస్ కు బాబు పూర్తిగా దగ్గరైపోయారు. కాంగ్రెస్ వ్యతిరేకంగా మొదలైన తెలుగుదేశం పార్టీని చివరకు కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకునేంత వరకూ తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు. ఇక ఇప్పుడు కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీని చంద్రబాబు పూర్తిగా భుజాల మీదకు ఎత్తుకుంటున్నారు.
ఎత్తుకోవడం కాదు, ఆల్రెడీ ఎత్తుకునేశారని విశ్లేషకులు అంటున్నారు. రాహుల్ ను బాగా మోస్తున్న ప్రాంతీయ పార్టీ అధినేతగా చంద్రబాబు నాయుడు నిలుస్తున్నారని వారు అభిప్రాయపడుతూ ఉన్నారు. అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎంత చేసినా పెద్దగా ప్రయోజనం ఉండదనే అభిప్రాయాలూ వినిపిస్తున్నాయి. ఎన్నికల ఫలితాల తర్వాతే ఎవరు ఎవరికి మిత్రుడో అనే అంశంపై క్లారిటీ వస్తుందని అంటున్నారు.
చంద్రబాబు నాయుడు ఏపీలో సాధించుకునే ఎంపీ సీట్లను బట్టే ఆయనకు ఢిల్లీలో అయినా, కాంగ్రెస్ పార్టీ ఆవరణలో అయినా విలువ దక్కుతుందని.. తగిన స్థాయిలో ఎంపీ సీట్లను సాధించుకోలేకపోతే చంద్రబాబును కాంగ్రెస్ కూడా పట్టించుకోదు అని విశ్లేషకులు అంటున్నారు.