Begin typing your search above and press return to search.
ఉపముఖ్యమంత్రి..హోం మంత్రి..మాకే: బాబు డిమాండ్!!
By: Tupaki Desk | 14 Nov 2018 5:37 AM GMTఆలూ లేదు చూలు లేదు...పదవులు మాత్రం సైకిల్ కే అన్నట్లు ఉంది... తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు - ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి స్పీడు. మహాకూటమిలో భాగంగా కాంగ్రెస్ - తెలంగాణ జన సమితి - సీపీఐలతో జత కట్టిన చంద్రబాబుకు తెలంగాణలో విజయం సాధించినట్లుగా నమ్మకం వచ్చేసింది. ఇదీ నిజమవుతుందా..లేక పగటికలగా మారుతుందా అనేది ఫలితాలు వచ్చే వరకూ తేలదు. అయిన చంద్రబాబు నాయుడు మాత్రం మహాకూటమి అధికారంలోకి వస్తే తమకు ఏ పదవులు కావాలో కాంగ్రెస్ అధిష్టానం ముందు ఉంచారంటున్నారు.
తెలంగాణ తెలుగుదేశం పార్టీకి మూడు నుంచి నాలుగు మంత్రి పదవులు కావాలని చంద్రబాబు నాయుడి డిమాండ్ గా చెబుతున్నారు. వీటిలో ఉపముఖ్యమంత్రి పదవి - హోంమంత్రి పదవి ఖచ్చితంగా తెలుగుదేశానికే ఇవ్వాలని చంద్రబాబు నాయుడి ప్రధాన డిమాండ్ గా చెబుతున్నారు. ఉపముఖ్యమంత్రి పదవితో పార్టీకి పూర్వవైభవం తీసుకుని రావాలని - హోంమంత్రి పదవితో తనపై ఉన్న ఓటుకు నోటు కేసు మాఫీ చేయించుకోవాలన్నది చంద్రబాబు నాయుడి ఆలోచనగా చెబుతున్నారు.
రాహుల్ గాంధీతో ఢిల్లీలో జరిగిన సమావేశంలో ఈ విషయం ప్రస్తావించినట్లు సమాచారం. ఓటుకు నోటు కేసులో తెలంగాణ ప్రభుత్వం తనను ఇరుకున పెట్టిందని దీనికి కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ సహకరించిందని చంద్రబాబు నమ్మకం. తెలంగాణలో మహాకూటమిని అధికారంలోకి తీసుకుని వచ్చే బాధ్యతను తాను తీసుకుంటానని - తన డిమాండ్లను నెరవేర్చే అంశాన్ని రాహుల్ గాంధీ పరిష్కరించాలని అన్నట్లు సమాచారం. అయితే ఈ డిమాండ్ల పై రాహుల్ గాంధీ స్పష్టమైన హామీ ఇవ్వలేదుంటున్నారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత మహాకూటమిలో అన్ని పక్షాలను సంతృప్తి పరుస్తామని - అలాగే ఓటుకు నోటు కేసు లేకుండా చేస్తామని హామీ ఇచ్చినట్లు చెబుతున్నారు. తెలుగుదేశం పార్టీకి హోంమంత్రి ఇవ్వకపోయిన - తన నుంచి వచ్చి కాంగ్రెస్ పార్టీలో కీలకంగా మారిన రేవంత్ రెడ్డి కైన హోంమంత్రి పదవి ఇవ్వాలని చంద్రబాబు నాయుడు మెలిక పెట్టినట్లు తెలుస్తోంది. దీని వల్ల స్వామి కార్యమూ - స్వకార్యము రెండు నెరవేరినట్లు అవుతుందని చంద్రబాబు అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ మహాకూటమి తెలంగాణలో అధికారంలోకి రాకపోతే ఓటుకు నోటు కేసులో జోక్యం చేసుకుని ఆ కేసును మాఫీ చేయించే బాధ్యత రాహుల్ గాంధీయే తీసుకోవాలని చంద్రబాబు నాయుడు కోరినట్లు సమాచారం. మొత్తానికి తెలంగాణలో ఎన్నికలు తెలుగుదేశం పార్టీకి - కాంగ్రెస్ పార్టీకి కంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి మనుగడకే సవాల్ గా మారుతున్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.