Begin typing your search above and press return to search.
జనాలు తిరస్కరించిన పనులే చేయాలంటున్న చంద్రబాబు
By: Tupaki Desk | 17 Oct 2019 1:30 AM GMT'చంద్రన్న కానుకలు' ఇవి చంద్రబాబు హయాంలోనే మొదలైన పథకాలు. అంతకు ముందు అలాంటి పథకాలు లేవు. చంద్రబాబు దిగిపోయాకా ఆ పథకాలనూ జగన్ పూర్తిగా రద్దు చేశారు. తన పేరిట కానుకలు ఇవ్వడం జగన్ కు కష్టం ఏమీ కాదు. అయినా ఆ పథకాలకు విలువ లేదని జగన్ భావిస్తూ ఉన్నారు.
పండగలు వచ్చినప్పుడు తన పేరుతో కానుకలు పంచారు చంద్రబాబు నాయుడు. పౌర సరఫరాల శాఖ ద్వారా ఉచితంగా పప్పు బెల్లాలు పంచారు. దానికి నెయ్యిని కూడా జోడించారు. పేదలకు ఉచితంగా, అంటే వైట్ రేషన్ కార్డు ఉన్న వారికి ఉచితంగా వాటిని అందించారు. అయితే వాటిల్లో నాణ్యత లేని సరుకును పంచారనే అభియోగాలున్నాయి. అదంతా పెద్ద స్కామ్ అని, ప్రభుత్వ ధనంతో అలా పప్పు బెల్లాలను పంచుతూ పౌరసరఫరాల శాఖ ద్వారా భారీగా దోచేశారనే ఆరోపణలూ ఉన్నాయి.
అవన్నీ ఎలా ఉన్నా.. అలాంటి పథకాలను అమలు చేసినా చంద్రబాబు నాయుడను జనాలు భేఖాతరు చేశారు. చంద్రబాబుకు ముందు అలాంటి పథకాలను ఎవరూ అమలు చేయలేదు. అయితే జనాలు మాత్రం మళ్లీ చంద్రబాబుకు ఓటేయలేదు. పండగలు వచ్చినప్పుడల్లా.. చంద్రన్న కానుకలు అని, తోఫాలు.. అంటూ చంద్రబాబునాయుడు ప్రజల సొమ్ముతో ప్రజలకే పప్పు బెల్లాలు పంచి - తన కమిషన్లు కొట్టినా.. ప్రజలు ఆయనకు ఓటేయలేదు. తెలుగుదేశం పార్టీని ఇరవై మూడు సీట్లకు పరిమితం చేశారు.
అదీ చంద్రన్న కానుకలకు వచ్చిన రిజల్ట్. అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు మళ్లీ ఆ కానుకలను డిమాండ్ చేస్తూ ఉన్నారు. తమ హయాంలో ఉచితంగా ఆహార కానుకలను పంచినట్టుగా ఇప్పుడు పంచడం లేదని చంద్రబాబుగారు తెగ ఫీలవుతూ ఉన్నారు. అయినా ప్రజలే అలాంటి పప్పు బెల్లాలు వద్దే వద్దని చంద్రబాబు నాయుడును పక్కన పెట్టాకా… ఇక మళ్లీ చంద్రబాబు అవే కావాలంటూ ఫీల్ కావడం కామెడీగా ఉందని విశ్లేషకులు అంటున్నారు.