Begin typing your search above and press return to search.
మోడీతో తగువు పెట్టుకునే దమ్ము బాబుకు లేదా?
By: Tupaki Desk | 2 Jun 2016 8:19 AM GMTవిభజన సందర్భంగా ఏపీకి జరిగిన అన్యాయం అంతా ఇంతా కాదన్నది తెలిసిందే. అయితే.. కాంగ్రెస్ చేసిన తప్పును సరిదిద్దుతానని.. తాను ఏపీని ప్రత్యేక దృష్టితో చూస్తానంటూ సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏపీలో పర్యటించిన సందర్భంగా మోడీ మాటలు చెప్పటాన్ని సీమాంధ్రులు ఎవరూ మర్చిపోలేరు. అయితే.. ఎవరూ ఊహించని విధంగా ఎన్నికల ఫలితాలు రావటం.. పాలనకు అవసరమైన పూర్తి స్థాయి మెజార్టీ బీజేపీ ఒక్కదానికే రావటంతో ఏపీ ప్రజలకు మోడీ చెప్పిన మాటల్ని మర్చిపోయిన పరిస్థితి. ఒకవేళ.. గుర్తు చేద్దామన్నా.. ఇప్పుడు బాబు పులుసులో ములక్కాయ లాంటోడు. ఇంకా చెప్పాలంటే కూరలో కరివేపాకు లాంటోడు.
అలాంటప్పుడు ఒక ములక్కాయ.. ఒక కరివేపాకు కూరను ప్రభావితం చేస్తాయా? అన్న ప్రశ్నకు సమాధానమే ప్రస్తుతం మోడీ దగ్గర బాబు పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో న్యాయంగా తన రాష్ట్రానికి రావాల్సిన నిధులు..ప్రాజెక్టుల కోసం మోడీని ఏ విధంగా డీల్ చేయాలన్నది పెద్ద సమస్య. ఒకటి గొడవ పెట్టుకోవటం. సంపూర్ణమైన బలంతోపాటు.. విపరీతమైన ప్రజాదరణ ఉన్న మాటల మనిషి మోడీతో తగువు పెట్టుకోవటం వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువే.
కేంద్రంలో తగువు పెట్టుకుంటే ఇప్పుడొచ్చే చిల్లర పైసలు కూడా రాలని దుస్థితి. అలా అని.. సీమాంధ్ర దగ్గర కుప్పలు కుప్పలుగా నిధులు ఉంటే.. ధనబలంతో పోరు చేయొచ్చు. విభజన కారణంగా బక్కచిక్కిన ఏపీ.. మోడీని డిష్యూం.. డిష్యూం అని బాబు తలపడితే.. ఒక్క పంచ్ తో లేవకుండా చేయగల సమర్థత మోడీ సొంతం. ఇలాంటప్పుడు మోడీతో తగువు పెట్టుకోవాలని చెప్పే వారి మాటలు అర్థం లేనివిగా ఉంటాయి.
మన మాటల్లో ఏముంది కానీ.. మోడీతో ఫైటింగ్ విషయంలో బాబు మనసులో ఏముంది? ఆయన నిజంగా ఏమనుకుంటున్నారు? మోడీ తీరు పట్ల బాబు ఎలా ఫీల్ అవుతున్నారన్న విషయాన్ని ఓపెన్ గా చెప్పేశారు. ‘‘నేను 20 సార్లు ఢిల్లీకి ఎందుకు వెళ్లాను? బీజేపీకి రాజ్యసభ సీటు ఎందుకు ఇచ్చాను? రాష్ట్రానికి న్యాయం జరగాలనే కదా? పదేళ్లు విపక్షంలో ఉన్నాం. సీట్లు కావాలన్నకోరిక మా వాళ్లకూ ఉంది. కానీ.. అమిత్ షా అడిగారని.. రాష్ట్ర అభివృద్ధి దృష్టిలో ఉంచుకొని సురేశ్ ప్రభుకి టిక్కెట్టు ఇచ్చాం. ఇది మిత్రధర్మం. కేంద్రంతో గట్టిగా వ్యవహరిస్తే మరింత సాయం వస్తుందంటే అంతకంటే ఏం కావాలి? రాష్ట్రానికి నిధులు ఎక్కువ తేవాలన్న ఆశ నాకు ఉండదా? కేంద్రం నుంచి సాయం ఎక్కువగా వస్తే ఎక్కువగా ఊరట చెందేది నేనే. కేంద్రం రూ.10వేల కోట్లు ఇస్తే రాష్ట్రాన్ని ఇంకా బ్రహ్మాండంగా అభివృద్ధి చేయనా? నా వంతు నేను గట్టిగా కృషి చేస్తున్నాను. మొత్తం వ్యవహారం చెడగొట్టాలన్నది విపక్షాల ఉద్దేశం. నేను కేంద్రాన్ని తిడితే.. వాళ్లు రాష్ట్రానికి ఏమీ ఇవ్వకపోతే.. వీళ్లకు సంతోషం. ఆ దురుద్దేశంతో ఆరోపణలు చేస్తుననారు. సాయం చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నాను. అడుగుతున్నాను. వెంటపడుతున్నాను. రాజీ పడకుండా నా ప్రయత్నం నేను చేస్తున్నాను’’ అంటూ చెప్పుకొచ్చారు.
బాబు మాటల్ని చూస్తే.. కేంద్రంతో ఫైటింగ్ కు వాతావరణం ఏ మాత్రం అనుకూలంగా లేదన్న విషయం స్పష్టంగా అర్థమవుతుంది. రాజకీయం కోసం ఫైటింగ్ చేయటం వల్ల నష్టం ఏపీకే అన్న మాట స్పష్టంగా కనిపిస్తుంది.. మోడీతో ఫైటింగ్ చేసే దమ్ము కంటే.. తెలివిగా ఏపీ అవసరాలను తీర్చటమే బాబు లక్ష్యంగా కనిపిస్తుందని చెప్పొచ్చు. గొడవలతో అభివృద్ధి సాధ్యం కాదన్న విషయం బాబుకు తెలియందా?