Begin typing your search above and press return to search.
బాబు డిమాండ్..జగన్- పెద్దిరెడ్డిలపై దిశ కేసులు పెట్టాలి
By: Tupaki Desk | 13 March 2020 5:01 PM GMTస్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఏపీలో అత్యంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అధికార వైసీపీ, విపక్ష టీడీపీ మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. వీలయినన్ని స్థానిక సంస్థలను చేజిక్కించుకునేందుకు అధికార వైసీపీ... తన అధికారాన్ని అడ్డం పెట్టుకుని దౌర్జన్యాలకు పాల్పడుతోందని టీడీపీ విమర్శిస్తోంటే... టీడీపీనే తమ నేతలపై దాడులకు దిగుతోందని వైసీపీ ప్రత్యారోపణలు చేస్తోందని మండిపడుతోంది. ఈ క్రమంలో నామినేషన్ల ఘట్టంలోనే లెక్కలేనన్ని గొడవలు జరిగినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఈ గొడవలన్నింటికీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిలే కారణమని ఆరోపించిన టీడీపీ అధినేత, విపక్ష నేత నారా చంద్రబాబునాయుడు... వారిద్దరిపై దిశ చట్టం కింద కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం తాడేపల్లిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు.
టీడీపీ అభ్యర్థులకు వైసీపీ శ్రేణులు అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నాయని, మహిళలపైనా దారుణంగా వ్యవహరిస్తున్నాయని చంద్రబాబు మండిపడ్డారు. ఇంత దారుణం జరుగుతున్నా సీఎం జగన్, హోం మంత్రి సుచరిత, ఎన్నికల సంఘం పట్టించుకోవడం లేదని ఆయన ధ్వజమెత్తారు. ఏపీలో ఆడబిడ్డలకు రక్షణ ఉందా? అని ప్రశ్నించిన చంద్రబాబు... సీఎం జగన్, మంత్రి పెద్దిరెడ్డిపై దిశ చట్టం కింద కేసులు పెడితే గానీ వారికి బుద్ధిరాదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైసీపీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని, ప్రత్యర్థుల ఇళ్లలో మద్యం బాటిల్స్ పెడుతున్నారని ఆయన ఆరోపించారు. తెనాలిలో నాలుగో వార్డు అభ్యర్థిగా టీడీపీ తరఫున పోటీ చేస్తున్న అడుసుమిల్లి వెంకటేశ్వరరావు ఇంటి గోడ దూకి ఓ వ్యక్తి వెళ్లాడని, మేడ పైన ట్యాంక్ దగ్గరకు వెళ్లి మద్యం బాటిల్స్ ఉన్న అట్టపెట్టెను అక్కడ పెట్టి వచ్చాడని ఆరోపించిన బాబు... ఇందుకు సంబంధించిన వీడియోను ప్రదర్శించారు.
తిరుపతిలో టీడీపీ నేత కామేశ్ యాదవ్ ఇంట్లో కూడా మద్యం సీసాలు ఉన్నాయంటూ వైసీపీ నేతలు ఆందోళన చేశారని చంద్రబాబు మండిపడ్డారు. వైసీపీ నేతలు మహిళలపై అరాచకాలకు పాల్పడుతున్నారని, పుంగనూరులో నామినేషన్ వేసేందుకు వెళ్లిన మహిళను అడ్డుకున్నారని, మామూలు దుస్తుల్లో వెళితే గుర్తుపట్టి అడ్డుకుంటారని బురఖా ధరించి వెళ్లినా ఆమెను అడ్డుకున్నారని మండిపడ్డారు. నామినేషన్ వేసేందుకు వెళ్లిన మరో మహిళపైనా వైసీపీ నేతలు దుర్మార్గంగా వ్యవహరించారని, ఆమె తన రవికెలో దాచుకున్న నామినేషన్ పత్రాలను సైతం లాక్కునే యత్నం చేశారని చంద్రబాబు ధ్వజమెత్తారు. ధర్మవరంలో మహిళ నామినేషన్ పత్రాలు లాక్కున్నారని, రాయచోటిలో మైనార్టీ వ్యక్తి నామినేషన్ పత్రాలు లాక్కున్నారని, పోలీసుల ముందే వైసీపీ నేతలు అరాచకాలు చేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు.