Begin typing your search above and press return to search.
పుష్కర తొక్కిసలాట: రంగంలోకి దిగిన బాబు
By: Tupaki Desk | 14 July 2015 6:47 AM GMTపుష్కర స్నానం చేసి.. పుణ్యం మూటగట్టుకోవాలని ఆశ.. పది మంది ప్రాణాల్ని తీసింది. కారణం ఏదైనా.. వైఫల్యం ఎవరిదైనా.. బాధ మాత్రం బాధిత కుటుంబాలదే. జరిగిన దుర్ఘటనపై ఏపీ ముఖ్యమంత్రి స్పందించారు. తొక్కిసలాట సందర్భంగా చోటు చేసుకున్న పరిస్థితిని సమీక్షించేందుకు తానే రంగంలోకి దిగారు.
పుష్కరాల కోసం ఏర్పాటు చేసిన కంట్రోల్ రూంకి చేరుకున్న ముఖ్యంత్రి చంద్రబాబు.. పరిస్థితిని వ్యక్తిగతంగా సమీక్షిస్తున్నారు. బాధితులకు సహాయ చర్యలకు ఆదేశించటంతో పాటు.. పరిస్థితిని మామూలు స్థితికి తీసుకురావటానికి ప్రయత్నాలు మొదలు పెట్టారు.
తొక్కిసలాటలో గాయపడిన వారి అవసరమైన వైద్య సాయం అందించేందుకు సిబ్బందిని రంగంలోకి దించటంతో పాటు.. ఈ ఘటనను దగ్గరుండి సమీక్షిస్తున్నారు. ఒకే ఘాట్ కి ఎక్కువ మంది భక్తులు తరలి రావటం వల్ల ఈ దుర్ఘటన జరిగిందని చెబుతున్న అధికారులు.. ఇలాంటి పరిస్థితి ఏర్పడితే.. తొక్కిసలాట జరగకుండా ఏం చేయాలన్న దానిపై ముందస్తు ప్రణాళికను ఎందుకు సిద్ధం చేయాలేదన్న మాట వినిపిస్తోంది. తొక్కిసలాట జరిగిన ఘాట్ వందేళ్ల నుంచి పుష్కర ఘాట్ గా ఖ్యాతి గాంచింది. ఇప్పటికీ రాజమండ్రిలో దానిని పుష్కరాల రేవు అనే పిలుస్తారు. పైగా రాజమండ్రిలో ఉన్న గోదావరి రైల్వేస్టేషను పక్కనే ఉండటం, అక్కడ ఆధ్యాత్మిక ఏర్పాట్లు, అలంకరణలు భారీగా ఉండటంతో అదే ప్రధాన ఘాట్-అక్కడే స్నానం చేయాలని అందరూ భావించడంతో రద్దీ అనూహ్యంగా పెరిగింది. ఏదేమైనా అద్భుతంగా ఏర్పాట్లు చేసుకున్నామని ప్రచారం చేసుకునే వారు.. ఎలాంటి ప్రమాదాలు చోటు చేసుకోకుండా.. ప్రశాంతంగా ఇలాంటి కార్యక్రమాలు జరిగేలా ఎందుకు ఏర్పాట్లు చేయలేకపోతున్నట్లు..? అన్న విమర్శ కూడా కొన్ని వర్గాల నుంచి వస్తోంది.