Begin typing your search above and press return to search.
తెలంగాణకు గ్రామాలు ఇస్తానని బాబు చెప్పారా?
By: Tupaki Desk | 18 Feb 2016 4:27 AM GMTతెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తో డీలింగ్ అంటే కత్తి మీద సాముగా చెబుతుంటారు. ఆయన నోటి నుంచి ఎప్పుడు ఎలాంటి కామెంట్ వస్తుందన్న భయంతో ఆయన ప్రత్యర్థులు వణికిపోతుంటారు. మర్యాదగా మాట్లాడుతూనే.. ఆయనిచ్చే షాకుల్ని తట్టుకోవటం సామాన్యులకు సాధ్యం కాదని చెబుతారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవహారమే తీసుకుంటే.. ఎదురుపడినప్పుడు.. అన్నా.. అన్నా అంటూ మర్యాదగా పలుకరించే కేసీఆర్.. ఏదైనా విమర్శ చేయాల్సి వస్తే.. ఎంత దారుణంగా విమర్శలు చేస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
ఓటుకు నోటు.. ఫోన్ ట్యాపింగ్ వివాదం తర్వాత కొంతకాలం ఎదురెదురు పడేందుకు సైతం ఇష్టపడని ఇద్దరు చంద్రుళ్లు.. మొత్తానికి కొందరు పెద్దమనుషుల పుణ్యమా అని పోరు ఆపి.. స్నేహంగా ఉన్న పరిస్థితి. దీంతో కేసీఆర్ అమరావతి శంకుస్థాపనకు వస్తే.. చంద్రబాబు.. అయుత చండీయాగానికి వెళ్లారు. ఇదిలా ఉంటే.. ఈ రెండు సందర్భాలకు సంబంధించి పిలుపుల సందర్భంగా ఇరువురు చంద్రుళ్లు.. ఏకాంతంగా భేటీ కావటం మర్చిపోకూడదు.
ఇలా ఏకాంతంగా ఇద్దరు చంద్రుళ్లు ఏం మాట్లాడుకున్నారన్న విషయంపై ఎవరూ నోరు విప్పింది లేదు. అయితే.. ఇటీవల కేసీఆర్ తన ఖమ్మం జిల్లా పర్యటన సందర్భంగా పోలవరం ప్రాజెక్టు కోసం ఏపీలో కలిసిన కొన్ని గ్రామాలు.. తెలంగాణకు తిరిగి ఇచ్చేస్తానని బాబు తనతో చెప్పినట్లుగా చెప్పి సంచలనం రేపారు. నిజంగానే కేసీఆర్ కు బాబు.. ఆ మాట ఇచ్చారా? అన్న డౌట్ వచ్చింది.
ఈ విషయంపై టీడీపీకి చెందిన కీలక నేతల దగ్గర ఇదే విషయాన్ని ప్రస్తావిస్తే.. అసలు విషయాన్ని చెప్పుకొచ్చారు. ఇరువురు చంద్రుళ్లు ఏకాంతంగా కలిసిన సందర్భంగా.. ఏపీలోకలిపిన గ్రామాలకు సంబంధించి మొత్తం రెండు లేదంటేమూడు గ్రామాల్ని తిరిగి తెలంగాణకు ఇవ్వాలని.. పాలనా పరమైన ఇబ్బందులు.. సరిహద్దు సమస్యలతో ఇబ్బందిగా ఉందని చెప్పటం.. దీనికి చంద్రబాబు ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది. దాదాపు 400 పైగా గ్రామాలు కలవగా.. పరిపాలనా సౌలభ్యం కోసం రెండు లేదంటే మూడు గ్రామాలు తమకు ఇస్తే చాలా ఇబ్బందులు తొలుగుతాయని బాబును కేసీఆర్ కోరారని.. దీనికి సర్లేనని ఆయన తలూపినట్లుగా తెలుస్తోంది.
ఇదేదో గుట్టుగా సాగిపోతుందని బాబు భావిస్తే.. ఆ అంశాన్ని తన విజయంగా చెప్పుకునేందుకు కేసీఆర్ ప్రయత్నించటం తెలుగుదేశం అధినేతకు షాకింగ్ గా మారిందని చెబుతున్నారు. సాయంగా ఉంటుందన్న అభ్యర్థన పట్ల సానుకూలంగా స్పందించటం తప్పు అయ్యిందా? అంటూ బాబు సన్నిహితులు వాపోయిన తీరు చూస్తే.. సమీప భవిష్యత్తులో కేసీఆర్ తో ఏ డీలింగ్ కు ఓకే అన్న మాట బాబు నోటి వెంట రాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.