Begin typing your search above and press return to search.
బాబుకు వెంకయ్య అభయహస్తం!
By: Tupaki Desk | 10 Jun 2015 9:30 AM GMTరేవంత్ రెడ్డికి సంబంధించిన ఓటుకు నోటు కేసులో వారం రోజులుగా జరుగుతున్న పరిణామాలతో తల బొప్పి కట్టిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఢిల్లీ పర్యటనలో కొంచెం ఉపశమనం లభించినట్లు సమాచారం. ఢిల్లీ పర్యటనలో భాగంగా ఆయన ముందుగా కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడితో సమావేశమయాఆ్యరు. పైకి చెప్పడం రాష్ట్ర సమస్యల గురించి చర్చించినట్లు చెబుతున్నా ప్రధానంగా వాళ్లిద్దరి మధ్య చర్చ ఓటుకు నోటు కేసు గురించేనని తెలుగుదేశం నాయకులు చెబుతున్నారు.
తనతో పాటు ఆంధ్రప్రదేశ్ మంత్రులు, తెదేపా నాయకుల ఫోన్లను తెలంగాణ ప్రభుత్వం ట్యాపింగ్ చేయడం గురించి చంద్రబాబు వెంకయ్య దగ్గర ప్రస్తావించి తీవ్రంగా మాట్లాడారని తెలిసింది. రేవంత్ కేసు విషయంలో ఫోన్ సంభాషణకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం తనకు నోటీసు ఇస్తే ఏం చేయాలన్న దానిపై బాబు, వెంకయ్యతో చర్చించినట్లు తెలిసింది. తెలంగాణ ప్రభుత్వంపై టెలిఫోన్ ట్యాపింగ్ కేసు గురించి కూడా చర్చ జరిగిందని.. ఈ విషయంలో బాబుకు సహకరించడానికి వెంకయ్య అభయహస్తం ఇచ్చారని సమాచారం. ఇద్దరు ముఖ్యమంత్రులు రాజకీయాలు మాని.. అభివృద్ధిపై దృష్టిపెట్టాలని వెంకయ్య సూచించినట్లు తెలిసింది.