Begin typing your search above and press return to search.
బాబుగారి బ్రాండ్ ఇమేజ్‌తోనే ఫ్రీ అంట
By: Tupaki Desk | 26 May 2015 5:50 AM GMTగొప్పలు చెప్పుకునే అవకాశం వస్తే.. ఎవరు మాత్రం వదులుకుంటారు. అది ఏపీ ముఖ్యమంత్రి అయినా కావొచ్చు.. సాదాసీదా వ్యక్తి అయినా కావొచ్చు. తాజాగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాటలు చూస్తే.. ఇదే మాట గుర్తుకు రావటం ఖాయం.
తన పేరు ప్రఖ్యాతులు.. తనకున్న విశ్వసనీయత.. తన పార్టీకి ఉన్న ప్రతిష్ఠల కారణంగానే.. సింగపూర్ సర్కారు.. ఏపీ రాజధాని అమరావతికి మాస్టర్‌ప్లాన్‌ను ఉచితంగా చేసి ఇచ్చేందుకు సిద్ధమైందని వ్యాఖ్యానించారు. ప్రతి తెలుగువాడు గర్వంగా చెప్పుకునేలా రాజధాని నగరాన్ని నిర్మిస్తామని ఆయన వ్యాఖ్యానించారు. ప్రపంచ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ రాజధాని నగరాన్ని నిర్మిస్తామని చెప్పిన చంద్రబాబు.. రాజధాని నగరం అంటే ఏదో పరిపాలన భవనాలతో నింపివేయటం కాకుండా.. డైనమిక్ సిటీలా ఉండేలా నిర్మిస్తామని చెప్పుకొచ్చారు.
1.30కోట్ల మంది జీవనం సాగించేలా మాస్టర్‌ప్లాన్‌ను రూపొందించారని.. మొత్తంగా రాజధాని ప్లాన్ బాగుందని.. కాకుంటే అక్కడక్కడ కొన్ని మార్పులు చేయాల్సి ఉందని వ్యాఖ్యానించారు. వ్యక్తిగతంగా తనకు.. తెలుగుదేశం పార్టీకి.. ప్రభుత్వానికి ఉన్న విశ్వసనీయత కారణంగానే రాజధాని నగర నిర్మాణంలో సహకారం అందించేందుకు సింగపూర్ సర్కారు ఉచితంగా డిజైన్ చేసేందుకు ముందుకొచ్చిందని వ్యాఖ్యానించారు.
ప్రజా రాజధానిగా అమరావతిని చూడాలన్నదే తన లక్ష్యమని చెప్పిన చంద్రబాబు.. రాజధాని నిర్మాణం ఎప్పుడు పూర్తి అవుతుందన్న తేదీని తాను చెప్పలేనన్నారు. రాజధానిని ఎంత త్వరగా వీలైతే.. అంత త్వరగా పూర్తి చేస్తామన్నారు. రాజధాని నిర్మాణం ఒక్కసారే జరుగుతుందని.. భవిష్యత్తు తరాల్ని దృష్టిలో పెట్టుకొని నిర్మిస్తున్నామన్నారు. రాజధాని నిర్మాణానికి చైనా.. జపాన్ సహా.. సహకారం అందించే అన్ని దేశాల సాయం తీసుకుంటామని వ్యాఖ్యానించారు. మొత్తానికి తన గొప్పతనాన్ని చాటి చెప్పుకునేందుకు.. చంద్రబాబు చాలానే కష్టపడుతున్నారు.