Begin typing your search above and press return to search.
చంద్రబాబు ప్రచారానికి మళ్లీ గిరాకీ!
By: Tupaki Desk | 8 May 2019 6:39 AM GMTదేశ వ్యాప్తంగా తిరిగి భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం చేయాలని ఉబలాటపడుతున్న చంద్రబాబును గత కొన్నిరోజులుగా ఏపార్టీలూ అంత పట్టించుకోలేదు. చంద్రబాబునాయుడును ఎవరూ ప్రచారానికి ఆహ్వానించిన దాఖలాలు కనిపించలేదు.
ఏపీ లో ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత చంద్రబాబు నాయుడు ముందుగా కర్ణాటక వెళ్లారు. ఆ తర్వాత తమిళనాడుకు వెళ్లారు. మళ్లీ మహారాష్ట్రకు వెళ్లొచ్చారు. ఒక్కో రాష్ట్రంలో ఒకటీ రెండు రోజుల పాటు చంద్రబాబు ప్రచారం జరిగింది.
అయితే ఆ తర్వాత మాత్రం బాబును ఎవరూ ప్రచారానికి పిలిచినట్టుగా కనిపించలేదు. దీంతో ఆయన అమరావతికే పరిమితం అయ్యారు. అయితే ఇప్పుడు చిన్న మార్పు. ఇప్పటికే ఢిల్లీలో ఉన్న చంద్రబాబు నాయుడు అక్కడ నుంచినే ఎన్నికల ప్రచారానికి వెళ్తారట.
కోల్ కతాలో చంద్రబాబునాయుడు ఎన్నికల ప్రచారాన్ని సాగించనున్నట్టుగా సమాచారం. అక్కడ టీఎంసీ తరఫున చంద్రబాబునాయుడు ప్రచారాన్ని సాగించనున్నట్టుగా తెలుస్తోంది. కోల్ కతా లో కూడా కొద్దో గొప్పో తెలుగు వాళ్లు ఉండవచ్చు.
అలాంటి వారిని ప్రభావితం చేయడానికి, బీజేపీ వ్యతిరేకంగా తామంతా ఒకే గుంపుగా ఉన్నట్టుగా చూపించుకోవడానికి చంద్రబాబు నాయుడు అక్కడ ప్రచారం చేయనున్నారట. మొత్తానికి మోడీ మీద విరుచుకుపడటానికి బాబుకు ఇంకో ఛాన్స్ లభించినట్టుగా ఉందని పరిశీలకులు అంటున్నారు.