Begin typing your search above and press return to search.
ఈసారి ‘‘చంద్రన్న’’ ఖర్చు రూ.430కోట్లు
By: Tupaki Desk | 20 Dec 2015 10:06 AM GMTకానుకలు ఇవ్వటం తప్పు కాదు. కానీ.. ఆర్థిక పరిస్థితి చూసుకొని ఆచితూచి ఖర్చు చేయాలి. ఆర్థిక ఇబ్బందుల గురించి ఓపక్క పెడబొబ్బలు పెడుతూనే. మరోవైపు ఆచితూచి ఖర్చులు పెట్టకుండా.. ‘‘కానుకల’’ పేరుతో భారీగా నిధులు వృధా చేయటం ఏపీ సర్కారుకే చెల్లుతుంది. పండగల సందర్భంగా కానుకులు ఇచ్చే చిత్రమైన కల్చర్ కు చంద్రబాబు తెర తీయటం తెలిసిందే. ఈ ఏడాది సంక్రాంతి పండక్కి ‘‘చంద్రన్న కానుక’’ పేరుతో పిండివంటలు తయారు చేసుకునేందుకు అవసరమైన సామాగ్రిని అందించారు. దీనికి ప్రజల్లో సానుకూల స్పందన రావటంతో.. ఖర్చు విషయాన్ని పెద్దగా పట్టించుకోకుండా.. వచ్చే సంక్రాంతి పండగ సందర్భంగా ఈ పథకాన్నికొనసాగించాలని నిర్ణయించారు.
క్రిసమస్ సందర్భంగా తెల్లరేషన్ కార్డులు ఉన్న పేద క్రైస్తవులకు చంద్రన్నకానుక పేరిట పిండివంటలు చేసుకునేందుకు వీలుగా నిత్యవసర వస్తువులు ఇవ్వాలని డిసైడ్ చేశారు. ఈ కానుక సంచిలో గోధుమపిండి.. పంచదార.. శనగపప్పు.. నెయ్యి.. బెల్లం ఉంటాయి. క్రిసమస్ సందర్భంగా క్రైస్తవులకు ఇచ్చే చంద్రన్నకానుకను.. జనవరి 1 నుంచి సంక్రాంతి పండుగను పురస్కరించుకొని హిందూ.. ముస్లింలకు కూడా ఇవ్వనున్నట్లు ఏపీ సర్కారు చెబుతోంది.
దీంతో. ఏపీలోని 1.41 కోట్ల రేషన్ కార్డుదారులకు చంద్రన్న కానుకను అందించనన్నారు. వచ్చే ఏడాది మొదటి వారంలో సరఫరా చేసే ఈ చంద్రన్న కానుక కోసం ఏపీ సర్కారు పెడుతున్న ఖర్చు అక్షరాల రూ.430కోట్లు. ఇప్పటివరకూ వేసిన అంచనా ప్రకారం ఇంత భారీ మొత్తం అవసరమవుతుందని తేల్చారు. ఒకవేళ.. కాస్త అటూఇటూ అయినా కానుకను ఇవ్వాలని డిసైడ్ చేశారు. రాజు తలుచుకుంటే ‘కానుక’లకు కొదవేం ఉంటుంది.