Begin typing your search above and press return to search.
బాబు ఫార్ములా మారిపోయింది
By: Tupaki Desk | 13 Nov 2016 4:24 AM GMTఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోమారు తన విజన్ ను చాటుకున్నారు. సార్వత్రిక ఎన్నికలకు ఇంకా రెండున్నరేళ్ల సమయం ఉన్నప్పటికీ ఇప్పటికే పక్కా ప్రణాళికతో చంద్రబాబు ముందుకువెళుతున్నారు. అంతేకాకుండా పార్టీ తరఫున ఎమ్మెల్యే బరిలోకి దిగే వారికి ఏమేం క్వాలిటీలు ఉండాలో కూడా బాబు వివరిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేలకు సీట్ల కేటాయింపును పంచసూత్రాల విధానంతో జరుపుతానని ప్రకటించారు. 2019 నాటికి నియోజకవర్గాల సంఖ్య 275కు పెరిగే అవకాశం ఉందని బాబు వెల్లడిస్తూ ఆశావాహులందరికీ అవకాశాలు దక్కుతాయన్నారు. పార్టీ పదవులు - ఎమ్మెల్యే టిక్కెట్లు ఇచ్చేందుకు ఆధునిక టెక్నాలజీని వినియోగిస్తామని చంద్రబాబు వివరించారు. ఇదే సమయంలో జనాభా పెరుగుదల విషయంలో తన ఫార్ములా మారిపోయినట్లు ఆయన వెల్లడించారు.
పార్టీ నేతలు - కార్యకర్తల సమావేశం సందర్భంగా 2019 సార్వత్రిక ఎన్నికలకు తాను అనుసరించే విధానాన్ని చంద్రబాబు రెండున్నరేళ్ల ముందే బయటపెట్టారు. టీడీపీలో పదవులు ఇవ్వాలంటే ఐదు సూత్రాల ద్వారా అర్హత నిర్ణయించే విధానానికి శ్రీకారం చుడుతున్నామన్నారు. పార్టీ - మండల అధ్యక్షుల నుంచి రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యేల ఎంపిక వరకూ పాపులారిటీ - సమర్థత - కేపబులిటీ - స్కిల్స్ - ఐవీఆర్ ఎస్ విధానంలో ఎంపిక చేస్తామంటూ సుస్పష్టం చేసారు. అందుకే ఇప్పుటి నుంచే ఎమ్మెల్యేలు ప్రజల్లోకి వెళ్ళాల్సి ఉంటుందని బాబు వివరించారు. కొందరు పనిగట్టుకొని ఎన్ని విమర్శలు చేసినా తనకు బాధ లేదన్నారు. వారి విమర్శల్లో మంచి ఉంటే మాత్రం స్వీకరిస్తామన్నారు. రాష్ట్రంలో ఏ ప్రాంతానికీ అన్యాయం జరగనిచ్చే ప్రసక్తేలేదని చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రజలకు అవినీతి రహిత పాలనను అందిస్తామని, అందుకే అవినీతిని అంతం చేసేందుకు నడుం బిగించామన్నారు. కేంద్ర ప్రభుత్వం పెద్దనోట్ల రద్దు చేస్తే ఆ విధానాన్ని పూర్తిగా సమర్థించామని, కానీ, 2000 నోటు మళ్లీ ముద్రణ చేయడం సరైంది కాదని చంద్రబాబు తప్పుపట్టారు. దీనివల్ల మరో ఆర్థిక అరాచకం పుట్టుకొచ్చే ప్రమాదం ఉందన్నారు. సమాజంలో ఆర్థిక అసమానతులు లేకుండా చేయాలంటే అవినీతి అంతం కావాల్సిందేననన్నారు.
రాష్ట్రంలో ప్రతీ ఒక్కరి ఆదాయం పెంచేలా కార్యక్రమాల్ని చేపట్టనున్నట్టు చంద్రబాబు చెప్పారు. సహజ వనరులను సద్వినియోగం చేసుకుంటే అభివృద్ధి జరుగుతుందన్నారు. ఎలాంటి వనరులు అందుబాటులోలేని హైదరాబాద్ ను అభివృద్ధి పథంలో నిలిపిన తనకు అన్ని వనరులు ఉన్న ఏపీని అభివృద్ధి చేయడం కష్టం కాదని బాబు చెప్పుకొచ్చారు. పార్టీని బలోపేతం చేయాలని కార్యకర్తలను బాబు పిలుపునిచ్చారు. నదుల అనుసంధానంతో శ్రీకాకుళాన్ని అభివృద్ధి చేసే ప్రయత్నం చేస్తే ఎప్పుడో అభివృద్ధిచెందుతున్న జిల్లాల వరుసలోకి చేరేదని అందుకే జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్టు వివరించారు. నాగావళి - వంశధార నదుల అనుసంధానంతో చివరి ఎకరానికి సాగునీరు అందించి, మూడు పంటలు పండేలా చర్యలు తీసుకుంటామన్నారు. నెలకు ప్రతీ పేద కుటుంబానికి రూ.10,000 ఆదాయం రావాలనే దిశగా 15 సూత్రాల పథకం అమలు చేస్తామన్నారు. డ్వాక్రా సంఘాలకు రెండో విడత రుణమాఫీని బాబు ఈ సందర్భంగా విడుదల చేసారు. డ్వాక్రా మహిళా సంఘాల సమావేశంలో ముఖ్యమంత్రి పాల్గొంటూ ఇచ్చిన సొమ్ము మొత్తం ఇష్టం వచ్చినట్లు ఖర్చు చేసుకోవచ్చని తెలిపారు. కు.ని. లక్ష్యాలపై పిలుపునిచ్చిన వెంటనే 10 సంవత్సరాల్లో ప్రపంచ రికార్డును సాధించారని, ఇప్పుడు మళ్లీ కుటుంబాన్ని పెంచాలన్న బాధ్యత అప్పగిస్తున్నట్టు చంద్రబాబు పేర్కొన్నారు. రోబోలతో పనిచేయించుకునే పరిస్థితి వస్తుందని, రాష్ట్రంలో జనాభా తగ్గుముఖం పడుతోందని, మరణాలు, జననాల రేటు సమానంగా ఉండాలని బాబు ఉపదేశించారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/