Begin typing your search above and press return to search.
బాబుకు హిందీ టీచర్ అవసరం పడింది!
By: Tupaki Desk | 28 Sept 2016 11:59 AM ISTఇటీవల కేంద్రమంత్రి ఉమాభారతి నేతృత్వంలో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కలిపి అపెక్స్ కౌన్సిల్ సమావేశం జరిగింది. దీనికి సంబంధించిన కొన్ని ఆసక్తికర అంశాలు కాస్త ఆలస్యంగా బయటకు వచ్చాయి. ఈ సమావేశంలో పాల్గొన్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు హిందీ అర్థమవుతుంది కానీ తిరిగి మాట్లాడలేరు. అదే సమయంలో.. కేంద్రమంత్రి ఉమాభారతికి ఇంగ్లిషు తెలుసు కానీ తిరిగి మాట్లాడలేరు. ఇదిలా ఉంటే.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు హిందీ.. ఇంగ్లిషు రెండు భాషల్ని దంచి కొడతారు కాబట్టి ఆయనకు ఎలాంటి ఇబ్బంది లేదు. వచ్చిన చిక్కంతా చంద్రబాబుకే. ఎందుకంటే.. ఆయన తన వాదనను వివరించి చెప్పటంలో ఏమాత్రం తప్పు చేసినా.. అడ్డంగా బుక్ అయ్యేది ఆయనే. ఇంగ్లిషు రాని ఉమాభారతికి ఆమెకు అర్థమయ్యే హిందీలో ఏపీ వాదన ఆమె కన్వీన్స్ అయ్యేలా చెప్పాల్సిన పరిస్థితి.
దీంతో.. హిందీ బాగా తెలిసి.. మాట్లాడటం వచ్చిన అధికారుల చేత ఏపీ వాదనను వినిపించే ప్రయత్నంచేశారు. అంతేకాదు.. పవర్ పాయింట్ ప్రజంటేషన్ తో హిందీ.. ఇంగ్లిషులో కలిపి.. ఆమెకు అర్థమయ్యే ప్రయత్నం చేశారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఇలాంటి ఇబ్బందే లేదు. ఆయనకు.. ఆయన తరఫున వెళ్లిన అధికారులకు హిందీతో ఎలాంటి సమస్య లేదు. దీంతో.. తమ వాదనను ఎఫెక్టివ్ గా వినిపించటంలో కొంత సక్సెస్ అయినట్లుగా తెలుస్తోంది.
అపెక్స్ కౌన్సిల్ సమావేశం తర్వాత చంద్రబాబుకు హిందీ అవసరం బోధ పడిందనే మాట వినిపిస్తోంది. ఎందుకంటే జలపంచాయితీ ఒక్కరోజులో తేలిపోయేది కాదు. రానున్న రోజుల్లో మరిన్ని భేటీ అవసరం. అలాంటప్పుడు తన వాదనను కేంద్రానికి అర్థమయ్యేలా చెప్పాలంటే బాబు అయినా హిందీ నేర్చుకోవాలి. కేంద్రమంత్రి ఉమాభారతి అయినా ఇంగ్లిషు నేర్చుకోవాలి. అవసరం బాబుదే కాబట్టి.. హిందీ టీచర్ అవసరం ఇప్పుడాయనకు ఉందన్న మాట వినిపిస్తోంది. మరి.. హిందీ ప్రావీణ్యం మీద బాబు దృష్టి పెడతారా? ఎప్పటిలా అధికారుల మీద ఆధారపడి బండి నడిపిద్దామని డిసైడ్ అవుతారో కాలమే చెప్పాలి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/