Begin typing your search above and press return to search.
ఫిరాయింపు ఫైటింగులతో బాబుకు తలనొప్పి
By: Tupaki Desk | 2 May 2017 7:01 AM GMTప్రకాశం జిల్లా టీడీపీలో నేతల మధ్య వివాదాలు చంద్రబాబు చెప్పినా సద్దుమణగడం లేదు. ముఖ్యంగా అద్దంకి టీడీపీలో మాత్రం వర్గ విభేదాలు రగులుతూనే ఉన్నాయి. దశాబ్దాలుగా ఫ్యాక్షన్ గొడవలున్న కరణం బలరాం - గొట్టిపాటి రవికుమార్ ఇద్దరూ ఇప్పుడు టీడీపీలో ఉండడంతో పదేపదే వారి మధ్య నిత్య యుద్ధాలు జరుగుతున్నాయి. తాజాగా బాపట్ల పార్లమెంటు నియోజకవర్గ సమీక్షా సమావేశంలో మంత్రి పరిటాల సునీత సమక్షంలోనే ఎమ్మెల్సీ కరణం బలరాం - ఫిరాయింపు ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ మాటల తూటాలు పేల్చుకున్నారు. తొలుత మాట్లాడిన కరణం బలరాం నేరుగా ఎమ్మెల్యేపై ఆరోపణలు చేశారు. ఎమ్మెల్యే టీడీపీ కార్యకర్తలకు పించన్లు ఇవ్వడంలేదని కరణం ఆరోపించారు. కష్టకాలంలో పార్టీ కోసం పనిచేసిన వారిని పక్కనపడేసి వైసీపీ కార్యకర్తలకు గొట్టిపాటి పించన్లు ఇస్తున్నారని ఆరోపించారు. ఇలా చేయడం వల్ల టీడీపీకి పాత కార్యకర్తలు మిగలరని, కొత్తగా వచ్చిన వారూ ఉండరని వ్యాఖ్యానించారు.
కరణం బలరాం నేరుగా తనపై ఆరోపణలు చేసిన సమయంలో తాను ప్రతిస్పందిస్తే గొడవ ఖాయమని అంచనాకువచ్చిన ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ తాను తర్వాత మాట్లాడుతానని చెప్పి అర్థాంతరంగా సమావేశం నుంచి వెళ్లిపోయారు. కరణం బలరాం ప్రశ్నలకు ఎమ్మెల్యే సమాధానం చెప్పకుండా జారుకోవడం చర్చనీయాంశమైంది. ఇంతలోనే చీరాల గొడవ మొదలైంది. ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ పై ఎమ్మెల్సీ పోతుల సునీత తీవ్ర ఆరోపణలు చేశారు. పార్టీ కార్యకర్తలను అణచివేస్తున్నారని ఆరోపించారు. దీంతో ఇరువర్గాల వారు సమావేశంలో సవాళ్లు - ప్రతిసవాళ్లు విసురుకున్నారు. ఒక దశలో ఇరువర్గాలు బాహాబాహీకి దిగాయి. మంత్రి పరిటాల సునీత సర్ధిచెప్పే ప్రయత్నం చేసినా ఎవరూ లెక్కచేయలేదు.
ఇలా ఆ జిల్లాలో వర్గపోరు చంద్రబాబుకు తలనొప్పులు తెస్తోంది. కాగా కరణం బలరాం నేరుగా ఆరోపణలు చేసినా సమావేశంలో ఉండి ప్రతిఘటించకుండా గొట్టిపాటి బయటకు వెళ్లిపోవడంపై ఆయన వర్గీయులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కరణం బలరాంకు భయపడి బయటకు వెళ్లిపోయామన్న సంకేతాలు వెళ్తాయని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/