Begin typing your search above and press return to search.
నగరంలో 'బాబు' కు ఎదురుగాలి
By: Tupaki Desk | 3 Dec 2018 5:16 AM GMTనారా చంద్రబాబు నాయుడు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు కూడా. ఆయన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో రాజధాని హైదరాబాద్ లో ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. నగర శివారుతో పాటు మజ్లీస్ పార్టీ బలంగా ఉన్న పాతబస్తీలోనూ చంద్రబాబు నాయుడు తన ప్రచారాన్ని తీవ్రం చేశారు. తానే హైదరాబాద్ ని ఈ స్థాయికి తీసుకువచ్చానని - తాను లేకపోతే నగరం ఇలా ఉండేది కాదని కూడా ఆయన నమ్మబలుకుతున్నారు. ఈ ప్రచారంపై అధికార తెలంగాణ రాష్ట్ర సమితి తన అస్త్రాలను ప్రయోగిస్తోంది. హైదరాబాద్ ను కులీకుతుబ్ షా నిర్మించారని - చంద్రబాబు నాయుడు చేసిందేమిటంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. అంతే కాదు... తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు కూడా చంద్రబాబు నాయుడు ఏం చేసారు... దాని వల్ల ఆయనకు వచ్చిన ప్రయోజనం ఏమిటీ వంటి అంశాలను సైతం ప్రచారం చేస్తున్నారు. ఇది పార్టీ పరంగా జరుగుతున్న విమర్శ.
అయితే చంద్రబాబు నాయుడు ప్రచారంలో ప్రజల నుంచి కూడా విమర‌్శలు ఎదుర్కొవడం తెలుగుదేశం పార్టీ నాయకులకు మింగుడు పడడం లేదు. హైదరాబాద్ ను నిర్మించానని చెబుతున్న చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ లో చేసిన విధ్వంసం మాట ఏమిటని ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు నాయుడు అధికారంలో ఉండగా సమైక్య రాష్ట్రంలో వేలాది మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని - వ్యవసాయం దండగంటూ ఆయన చేసిన పనుల కారణంగా రైతు కుటుంబాలు కూలీల కుటుంబాలుగా మారాయని అంటున్నారు.
ముఖ్యంగా తెలంగాణలోని పల్లెల నుంచి నగరానికి వలసలు వచ్చిన వేలాది మంది రైతు కుటుంబాల వారు ఇక్కడ వాచ్ మెన్ లుగా పని చేస్తున్నారని ఐటీ మీద పడి వ్యవసాయాన్ని - రైతులను చంపేశారని తెలుగుదేశం నాయకులను నిలదీస్తున్నారు. హైటెక్ సిటీ - సైబరాబాద్ ల కారణంగా కొన్ని వేల మందికి ఐటీ ఉద్యోగాలు వచ్చాయని - ఇందులో ఇతర రాష్ట్రాలకు చెందిన వారు కూడా ఉన్నారనేది వారి వాదన. అయితే తొమ్మిదేళ్ల చంద్రబాబు నాయుడి పాలన పది మందిని బతికించడానికి వంద మందిని చంపినట్టుంది అన్నట్టు ఉందని ఇతర పార్టీలు ఆరోపిస్తున్నాయి. వ్యవసాయంపై నిర్లక్ష్యం వల్ల రైతుల ఆత్మహత్యలకు - వలసలకు చంద్రబాబునాయుడు బాధ్యత వహిస్తారా? అని ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు నాయుడి ప్రచారాన్ని ఆయన మీడియా అతిగా చూపిస్తున్నా.... వాస్తవాలు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయని రాజకీయ పండితులు అంటున్నారు. మొత్తానికి చంద్రబాబు నాయుడి నగర ప్రచారంలో లోలోపల వ్యతిరేకత వ్యక్తమవుతోందని అంటున్నారు.
పైగా ఇపుడు సిటీ జనరేషన్ కు బాబు సంగతులు ఏం గుర్తుండే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇక్కడ బాబు పాలన 15 సంవత్సరాల కిందట అంతమైంది. అందుకే ఐటీలో కూడా చాలామంది బాబుతో కనెక్ట్ కావడం లేదని తెలుస్తోంది.