Begin typing your search above and press return to search.
చంద్రబాబుకు రెబళ్ల బెడద
By: Tupaki Desk | 28 Feb 2017 8:52 AM GMTటీడీపీలో ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక సెగలు రేపుతోంది. టిక్కెట్లు రానివారిలో కొందరు పార్టీ చేసిన అన్యాయంపై మండిపడుతున్నారు. ఎంతోకాలంగా పార్టీని నమ్ముకుని ఉన్నా కూడా పదేపదే అన్యాయం చేస్తున్నారంటూ ఆగ్రహిస్తున్నారు. రెబల్ అభ్యర్థులుగా రంగంలోకి దిగేందుకు సిద్దమవుతున్నారు. దీంతో వ్యవహారం చెడేలా ఉందని భావించిన చంద్రబాబు వెంటనే మంత్రులు - సీనియర్ లీడర్లను రంగంలోకి దించి వారిని బుజ్జగించే పనిలో పడ్డారు.
ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజుకు అనూహ్యంగా టికెట్ ఇవ్వడంపై కలిశెట్టి అప్పలనాయుడు వర్గం మండిపడుతోంది. అప్పలనాయుడు అయితే బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇండిపెండెంట్ గా నామినేషన్ వేసేందుకు ఆయన రెడీ అయ్యారు. అయితే.. ఎంపీ రామ్మోహన్ నాయుడు - జిల్లా ఇంఛార్జి మంత్రి పరిటాల సునీత ఆయన్ను బుజ్జగిస్తుండడంతో మెత్తబడొచ్చని తెలుస్తోంది.
తూర్పుగోదావరి జిల్లాలో మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావుకు టికెట్ ఇవ్వడాన్ని బొడ్డు భాస్కరరామారావు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. బొడ్డు భాస్కర రామారావు రెబెల్‌గా బరిలోకి దిగేందుకు సిద్ధమవుతుండగా.. డిప్యూటీ సీఎం చినరాజప్ప - మంత్రి పుల్లారావు ఆయన్ను బుజ్జగిస్తున్నారు. పార్టీని నమ్ముకుంటే తనను మోసం చేశారని బొడ్డు భాస్కర రామారావు ఆరోపించారు.
పశ్చిమ గోదావరి జిల్లాలో అంబికా కృష్ణ అసంతృప్తి వ్యక్తం చేయగా.. నెల్లూరు జిల్లాలో వాకాటి నారాయణరెడ్డికి టికెట్ ఇవ్వడాన్ని ఆనం సోదరులు, ఆదాల ప్రభాకర్ రెడ్డి వ్యతిరేకిస్తున్నారు. ఆదాల కూడా సీరియస్ గా ఉండడంతో ఆయన్ను బుజ్జగిస్తున్నారు.
చిత్తూరు జిల్లాలో సిట్టింగ్ ఎమ్మెల్సీ నరేష్ కుమార్ రెడ్డికి టికెట్ దక్కలేదు. టికెట్ ఇస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లాలో దీపక్ రెడ్డికి టికెట్ ఇవ్వడంపై మెజార్టీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇక కర్నూలు జిల్లాలో శిల్పా చక్రపాణిరెడ్డిని మీనాక్షి నాయుడు, ఫరూఖ్ వ్యతిరేకిస్తున్నారు. వారిని బుజ్జగించే పనిని అచ్చెన్నాయుడు నెత్తినేసుకున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/