Begin typing your search above and press return to search.

దిల్లీ బలపరీక్షలో చంద్రబాబు విఫలమైనట్లేనా?

By:  Tupaki Desk   |   4 April 2018 3:30 PM GMT
దిల్లీ బలపరీక్షలో చంద్రబాబు విఫలమైనట్లేనా?
X
నిత్యం సర్వేలు చేయిస్తూ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులకు రేటింగులు ఇచ్చే చంద్రబాబు తన సొంత బలాన్నీ పరీక్షించుకునే ప్రయత్నంలోనే దిల్లీ వచ్చారన్న విమర్శ ఒకటుంది. అంతేకాదు.. ఆ సెల్ఫ్ టెస్టులో చంద్రబాబు ఘోరంగా విఫలమయ్యారట. ఆ సంగతి అర్థం కావడంతోనే టీడీపీ నేతలు ఇప్పుడు జాతీయ రాజకీయాల ఊసు రాకుండా జాగ్రత్త పడుతున్నట్లు టాక్. టీడీపీ నేత సీఎం రమేశ్ చేసిన తాజా వ్యాఖ్యలు కూడా ఈ పరిస్థితికి అద్దం పడుతున్నాయి. పైకి చెప్పకపోయినా చంద్రబాబు తన బలాన్ని పరీక్షించుకునేందుకు దిల్లీ వచ్చారన్న ప్రచారం ఒకటుంది. ఒకప్పుడు థర్డ్ ప్రంట్లలో కీలకంగా వ్యవహరించిన ఆయనకు నిజానికి ఇప్పుడు దేశంలోని ఇతర పార్టీల నుంచి పెద్దగా క్రేజ్ కనిపించడం లేదు. తాజాగా ఆయన దిల్లీలో భేటీ అయిన నేతలు, వారు స్పందించిన తీరుతో ఎవరూ ఆయన్ను సీరియస్ గా తీసుకోలేదన్న సంగతీ అర్థమవుతోంది.

ఈ క్రమంలోనే ఇప్పుడు సీఎం రమేశ్ వ్యాఖ్యలు చర్చనీయమవుతున్నాయి. టీడీపీకి థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేయడం కన్నా, రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని రమేష్ అన్నారు. సో.. మిగతా పార్టీల నుంచి ఆశించిన రెస్సాన్సు రాకపోవడంతో విషయం బోధపడి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారని విపక్షాలు సెటైర్లు వేస్తున్నాయి. మోదీని ఎదుర్కోగలరని కానీ.. లేదంటే ప్రత్యామ్నాయ కూటమికి నాయకత్వం వహించగల దక్షత - క్లీన్ ఇమేజి - రాజకీయ విశ్వాసం ఏవీ చంద్రబాబుకు ఇప్పుడు లేవన్న భావన ఇతర పార్టీల్లో ఉండడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. సొంత పార్టీ నేతలు కూడా చంద్రబాబు వచ్చినా రాజకీయాల్లో ఏమాత్రం చలనం రాకపోవడంతో బాబు ఈ బలపరీక్షలో ఓటమి చెందారని గుసగుసలాడుకుంటున్నారట.

రెండు రోజుల దిల్లీ పర్యటనలో అంచనాలు విఫలం కావడంతో చంద్రబాబుకు ఇప్పుడు మరింత టెన్షన్ పట్టుకుందని.. పలు ఇతర రాష్ట్రాల్లో బీజేపీ మొత్తం పొలిటికల్ సీన్ మార్చేసినట్లే ఏపీపైనా ఫోకస్ చేసి తానే టార్గెట్‌ గా రాజకీయాలు చేసే డేంజర్ ఉందని టెన్షన్ పడుతున్నారట. అయితే.. అన్నీ సిద్ధం చేసుకుని వచ్చారు కాబట్టి చివరి ప్రయత్నంగా సుదీర్ఘ ప్రెస్ మీట్ ఒకటి పెట్టి బీజేపీ మోసాన్ని అందరికీ తెలిసేలా చేయడానికి ప్రయత్నించారని తెలుస్తోంది. అసలే జనసేన - బీజేపీ అంతా తనను వదిలేసిన ఈ సమయంలో వచ్చే ఎన్నికల్లో ఎలా గట్టెక్కాలా అని చింతిస్తున్న చంద్రబాబుకు ఇప్పుడు దిల్లీలో ఎదురైన అనుభవాలు మరింత దిగులులోకి నెట్టేశాయట.