Begin typing your search above and press return to search.
కేంద్రంనుంచి రాబట్టడంలో మరో ఫెయిల్యూర్!
By: Tupaki Desk | 8 Sep 2015 4:02 AM GMT'ఇచ్చిన అన్ని హామీలను నెరవేరుస్తాం' అని భారతీయ జనతా పార్టీకి చెందిన పెద్దలంతా చిలకపలుకులు చెబుతూ ఉంటారు. కేంద్రం మన పట్ల సానుకూలంగా ఉన్నది.. హోదా గురించి మొండిగా పట్టుపట్టడం తప్ప.. హోదా విషయంలో టెక్నికల్ ఇబ్బందులు ఉండగా.. తతిమ్మా అన్ని రకాలుగానూ మన రాష్ట్రాన్ని ప్రత్యేకంగా ఆదుకోవడనికి కేంద్రం రకరకాల ప్యాకేజీలతో సిద్ధంగా ఉంది అని తెలుగుదేశానికి చెందిన చంద్రబాబు దగ్గరినుంచి కేంద్రమంత్రులు, రాష్ట్రమంత్రులు అంతా ఊదరగొట్టేస్తూ ఉంటారు. కానీ.. రాష్ట్రంతో అధికారికంగా ఒప్పందం చేసుకున్న విషయంలో కూడా ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడానికి, నిధులు మంజూరు చేయడానికి కేంద్రప్రభుత్వం వెనక్కు తగ్గడం ఇప్పుడు పెద్ద దెబ్బగా మారుతోంది. కేంద్రంనుంచి ఒప్పందం కుదిరిన నిధులను కూడా రాబట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం కావడం అంటే.. అది నాయకత్వ లోపమే అని ప్రజలు నిందించే ప్రమాదం ఉంది.
వివరాల్లోకి వెళితే.. రాష్ట్రంలోని అన్ని గ్రామాలకు కూడా గృహ వినియోగ విద్యుత్తును నిరంతరాయంగా 24 గంటలపాటూ ఇస్తాం అంటూ రాష్ట్రంలో తెదేపా అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా ఘనంగా ప్రకటించారు. నిజానికి ఇది కేంద్రప్రభుత్వ నిధులతో నడిచే.. పథకం. దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామజ్యోతి యోజన పథకం కింద కేంద్ర సర్కారు గత ఏడాది దేశవ్యాప్తంగా రెండే రాష్ట్రాలను ఈ పథకానికి ఎంపిక చేసింది. ఒకటి రాజస్థాన్ కాగా, రెండోది ఆంధ్రప్రదేశ్. ఏపీ పల్లెలకు కరెంటు కష్టాలు ఇక తీరిపోతాయి అని అందరూ అనుకున్నారు. అయితే ఇప్పుడు హఠాత్తుగా కేంద్రం చేతులెత్తేసింది. రాజస్థాన్ కు మాత్రం ఈ పథకం కింద 665 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసిన మోడీ సర్కారు, ఇదే పథకం కోసం 4 వేల కోట్ల రూపాయల అంచనాల్తో ప్రతిపాదనలు పంపిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక్క రూపాయి కూడా విదిల్చలేదు.
రాష్ట్రంలో పల్లె, పట్టణ తేడాలేకుండా పరిశ్రమలు సహా అందరికీ 24 గంటలూ విద్యుత్తు ఇవ్వాలని రాష్ట్ర సర్కారు అనుకుంటోంది. దీనికి అవసరమయ్యే విద్యుత్తు సరఫరా విషయంలో మనకేమీ కొరతలేదు. కానీ పల్లెలో గృహ వినియోగానికి, సేద్యానికి విడివిడిగా ఫేజుల్లో కరెంటు ఇవ్వాలి గనుక.. ఫీడర్లలో మార్పు చేయాల్సి ఉంటుంది. ఇలా మార్చకపోతే ఇళ్లకు సింగిల్ ఫేజ్ కరెంట్ మాత్రమే వస్తుంది. కేంద్రం నిధులు ఇస్తే.. వ్యవసాయ, గృహ వినియోగాలకు ఫీడర్లు వేరువేరుగా ఏర్పాటుచేయాలనేది ప్రతిపాదన. కేంద్రం ఈ విషయంలో మొండిచేయి చూపించడంతో.. ఇక ఈ పథకం ప్రశ్నార్థకంగానే మారుతోంది. కేంద్రంనుంచి నిదులు రాబట్టడంలో చంద్రబాబు సర్కారు వైఫల్యాల జాబితాలో ఇదికూడా చేరుతోంది.