Begin typing your search above and press return to search.
టచ్ లో వెళ్లిన నేత కోటరీ నడుపుతున్నాడా?
By: Tupaki Desk | 15 Jun 2019 11:30 AM GMTమొన్న అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ తాను ఓకే చెప్పాలే కానీ.. చంద్రబాబుకు విపక్ష నేత అయ్యే అవకాశం కూడా ఉండదంటూ బాంబు పేల్చారు. దీంతో అప్పటివరకూ కిందామీదా పడుతున్న చంద్రబాబుకు షాకింగ్ గా మారింది. జగన్ ప్రసంగించిన నాటి నుంచి బాబు అండ్ కో తీవ్ర అభద్రతా భావానికి గురైనట్లుగా చెబుతున్నారు.
ఎవరు ఎప్పుడు వెళ్లిపోతారో అన్నట్లుగా పరిస్థితి మారింది. ఒకరిపై ఒకరు అనుమానంగా చూసుకోవటం మొదలైనట్లుగా తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. బాబు బ్యాచ్ లో దాదాపు పది మంది ఎమ్మెల్యేలు జగన్ పార్టీలోకి వచ్చేందుకు రెఢీగా ఉన్నారని.. తమ పదవులకు రాజీనామా చేసి మరీ వచ్చేయటానికి సిద్ధమంటున్నట్లుగా తెలుస్తోంది.
అయితే.. తాము తమ పదవులకు రాజీనామా చేయాలంటూ జగన్ నుంచి కొన్ని హామీల్ని వారు అడుగుతున్నట్లుగా చెబుతున్నారు. తమ రాజీనామాతో జరిగే ఉప ఎన్నికల్లో తమ టికెట్లు.. లేనిపక్షంలో తాము చెప్పిన వారికి టికెట్లు ఇవ్వటంతో పాటు.. ఎన్నికల ప్రచారానికి తప్పనిసరిగా జగన్ రావాల్సి ఉంటుందని చెబుతున్నారు. గతంలోనూ ఎమ్మెల్సీగా ఉన్న శిల్పా చక్రపాణి రెడ్డి పార్టీలోకి వస్తున్నప్పటికీ.. ఆయన చేత పదవికి రాజీనామా చేయించి మరీ పార్టీలో తీసుకున్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు.
మొదట్నించి జగన్ ఒకే మాట మీద నిలబడినట్లుగా చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా మరో ఆసక్తికర అంశం బయటకు వచ్చింద. జగన్ పార్టీలో చేరేందుకు సిద్ధంగా నేతల్ని కూడగట్టేందుకు.. వారందరికి ఒక టీడీపీ కీలక నేత లీడ్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఉత్తరాంధ్రకు చెందిన ముఖ్యనేత ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసినట్లుగా చెబుతున్నారు. అధికారం ఎక్కడ ఉంటే అక్కడ ఉండేందుకు ఇష్టపడే ఆయన.. తాజాగా తమ బాస్ కు భారీ షాక్ కు ఇచ్చేందుకు సిద్దమవుతున్నట్లుగా తెలుస్తోంది. మరి.. దీనికి బాబు ఎలా కళ్లాలు వేస్తారో చూడాలి.