Begin typing your search above and press return to search.
చంద్రబాబును కొత్త టెన్షన్ పట్టుకుందా!
By: Tupaki Desk | 8 May 2019 8:00 PM ISTతెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడుకు కేసీఆర్ రూపంలో కొత్త టెన్షన్ పట్టుకుందనే ప్రచారం జరుగుతూ ఉంది. ఫెడరల్ ఫ్రంట్ అంటూ హడావుడి చేసిన కేసీఆర్ ఇప్పుడు తిరిగి యూపీఏ వైపు చూస్తున్నారనే అభిప్రాయాలు వినిపిస్తూ ఉన్నాయి. ఫెడరల్ ఫ్రంట్ అంటూ కేసీఆర్ చేసిన ప్రయత్నాలు అంత సఫలం కాలేదు. కాంగ్రెస్ - బీజేపీ మద్దతు లేకుండా కేంద్రంలో ఏ కూటమి కూడా అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదనే విశ్లేషణలు వినిపిస్తూ ఉన్నాయి.
ఈ క్రమంలో కేసీఆర్ కూడా తన ప్రయత్నాలు సఫలం కావనే అభిప్రాయానికి వచ్చి కేంద్రంలో యూపీఏ వైపు మొగ్గుచూపడానికే రెడీ అవుతున్నాడని వార్తలు వస్తున్నాయి. తెలంగాణలో ముస్లిం ఓటు బ్యాంకు గణనీయంగా ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని కేసీఆర్ బీజేపీ కూటమి వైపు వెళ్లలేడు అనే అభిప్రాయాలున్నాయి.
దీంతో ఆయన తప్పకుండా కాంగ్రెస్ ఆధ్వర్యంలోని కూటమి వైపు చేరే అవకాశాలు లేకపోలేదు. కేసీఆర్ సంగతలా ఉంటే.. అదే ఇప్పుడు చంద్రబాబు నాయుడును టెన్షన్ పెడుతోందనే ప్రచారం జరుగుతూ ఉంది. ఆల్రెడీ కాంగ్రెస్ పక్షాన చేరిపోయాడు చంద్రబాబు నాయుడు.
కాంగ్రెస్ కూటమి అధికారంలోకి వస్తే తను కూడా కేంద్రంలో అధికారంలో భాగస్వామి కావాలనేది చంద్రబాబు నాయుడి ప్రణాళిక. ఏపీలో అధికారం చేజారినా అలా ఢిల్లీ లెవల్లో పట్టు నిలుపుకోవాలనే ప్రయత్నంలో ఉన్నారాయన. ఈ నేపథ్యంలో ఇప్పుడు కేసీఆర్ యూపీఏ వైపు చూస్తున్నారనే వార్తలు బాబుకు నచ్చడం లేదని సమాచారం. అందుకే రాహుల్ తో ప్రత్యేకంగా సమావేశం అయ్యారట చంద్రబాబు నాయుడు.
'ఎట్టి పరిస్థితుల్లోనూ కేసీఆర్ ను యూపీఏలోకి చేర్చుకోవద్దు..' అంటూ చంద్రబాబు నాయుడు రాహుల్ కు సూచించారట. తెలంగాణలో కేసీఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలనే చేర్చుకొంటూ ఉన్నాని, అందుకే ఆయనను యూపీఏలోకి చేర్చుకోనే వద్దంటూ చంద్రబాబు నాయుడు రాహుల్ కు సూచించారట. మరి ఈ సూచనలను రాహుల్ ఎంత వరకూ పరిగణనలోకి తీసుకుంటాడో!