Begin typing your search above and press return to search.
చంద్రబాబుకు హైపర్ టెన్షన్?
By: Tupaki Desk | 4 Jan 2017 10:30 AM GMTమూడేళ్ల పాలనకు సమీపిస్తున్న ఏపీ సీఎం చంద్రబాబు అక్కడికి ఎన్నికలు మరో రెండేళ్లే ఉండడంతో తెగ టెన్షన్ పడుతున్నారట. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు వెక్కిరిస్తుండడంతో పాటు నిధుల లేమి ఆయన్ను బాగా భయపెడుతున్నట్లు తెలుస్తోంది.
ఎన్నికల ముందు అనేక ఆశలు కల్పించిన చంద్రబాబు ఇపుడు వాటిని ఎలా తీర్చాలా అన్న అయోమయంలో పడిపోయారు. పులిమీద పుట్రలా నోట్ల రద్దు తర్వాత అమరావతి ప్రాంతానికి వచ్చి పెట్టుబడులు పెట్టే వారి సంఖ్య కూడా తగ్గిపోయింది. మరోవైపు కేంద్రం నుంచి సాయం మాటలకే పరిమితం అవుతోంది. ఆంధ్రప్రదేశ్ కు ర్యాంకులు ఇస్తున్నా నిధులు మాత్రం ఇవ్వడం లేదు. ప్రత్యేక హోదా పోయింది.. ప్యాకేజీ కూడా పీచుమిఠాయిలానే కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు గంభీరంగా పైకి నవ్వుతున్నా లోలోన తెగ టెన్షన్ పడుతున్నారట.
రోజురోజుకు ఆర్థికంగా కుంగుతోన్న రాష్ట్రంగా మారడంతో ముఖ్యమంత్రి కలవరపాటు చెందుతున్నారు. కేంద్రం ఇచ్చిన నిధులను ప్రచారంకోసం - అనవసరపు కార్యక్రమాలకు ఖర్చుచేయడంతో ఇప్పుడు కేంద్రం నుంచి ఆర్ధిక సహాయం బాగా తగ్గిపోయింది. డబ్బులు అడిగితే ముందుఇచ్చిన నిధులకు లెక్కచెప్పమంటున్నారు. ప్రచారంకోసం ఖర్చుపెట్టిన, పార్టీకార్యకర్తలకు పందారం చేసిన ఆ డబ్బుకు లెక్క చెప్పలేని పరిస్థితి చంద్రబాబుది. అందుకే కేంద్రం మరిన్ని నిధులతో కనికరించడం లేదు. ఆర్భాటపు ప్రకటనలు - ఫంక్షన్ల మీద ఆయనకు అదుపులేదు. ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు - అధికారుల దగ్గర కొత్త ఆలోచనలు కూడా లేవు. దీంతో రాష్ర్టం ఆర్థిక పరిస్థితి దయనీయంగా తయారవుతుండడంతో చంద్రబాబు బాగా ఆందోళనకు గురవుతున్నట్లు ఆయన్ను దగ్గర నుంచి చూస్తున్న అధికారవర్గాలు చెబుతున్నాయి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/