Begin typing your search above and press return to search.
సొంత ఇలాకాపై బాబుకు సర్వే టెన్షన్
By: Tupaki Desk | 27 Jun 2017 5:18 AM GMTఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు కొత్త టెన్షన్ పట్టుకున్నట్లుగా చెబుతున్నారు. సొంత ఇలాకా అయిన చిత్తూరు జిల్లాలో తాజాగా చేయిస్తున్న ప్రైవేటు సర్వే ఫలితాలు అధినేతకు తీవ్ర అసంతృప్తిని మిగులుస్తున్నట్లుగా తెలుస్తోంది. పూర్తి సమాచారం ఇంకా అందనప్పటికీ.. ఇప్పటికే అందిన సమాచారం మాత్రం పార్టీ వర్గాలకు మింగుడుపడనట్లుగా ఉన్నట్లు తెలుస్తోంది.
మూడు నెలలకు ఒకసారి నిఘా వర్గాల ద్వారా చేయిస్తున్న సర్వే ఫలితాలపై సందేహాలున్న చంద్రబాబు.. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న చిత్తూరు జిల్లాలో పార్టీ పరిస్థితి ఎలా ఉంది? ప‌్రభుత్వం పట్ల ప్రజల వైఖరి ఏమిటన్న అంశాలకు సంబంధించి ఒక ప్రైవేటు సర్వే చేయిస్తున్నట్లుగా సమాచారం.
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. తాజాగా చేయిస్తున్న ప్రైవేటు సర్వే ఫలితాలు ఏమాత్రం సానుకూలంగా లేవని తెలుస్తోంది. గతంలో చేయించిన సర్వేలో నాలుగు సీట్లు మాత్రమే గెలవనున్నట్లుగా తేలటంతో.. ఈ ఫలితంపై క్రాస్ చెక్ చేయించేందుకు తాజాగా మరో సర్వేను చేయిస్తున్నట్లుగా చెబుతున్నారు.
నియోజకవర్గాల వారీగా ఎంపీలు.. ఎమ్మెల్యేల వైఖరితో పాటు.. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల విషయంలో ప్రజల స్పందన ఎలా ఉందన్న విషయంపై 12 ప్రశ్నలతో కూడిన ప్రశ్నావళిని రూపొందించినట్లుగా తెలుస్తోంది. తాజాగా విడుదలైన ఫలితాలు ముఖ్యమంత్రి చంద్రబాబుకు మింగుడు పడటం లేదని తెలుస్తోంది. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై ప్రజలు పాజిటివ్ గా లేరని చెప్పారని.. అవినీతిపై ప్రజలు అసంతృప్తిగా ఉన్నారని చెప్పినట్లుగా సమాచారం. జిల్లాలోని అధికార పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేల తీరుపై తీవ్ర అసంతృప్తితో ప్రజలు ఉన్నట్లుగా తేలినట్లు తెలుస్తోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/