Begin typing your search above and press return to search.

కేసీఆర్ వ్యూహాల‌తో బాబులో ఆందోళ‌న‌

By:  Tupaki Desk   |   3 Aug 2018 2:30 PM GMT
కేసీఆర్ వ్యూహాల‌తో బాబులో ఆందోళ‌న‌
X
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు ఇటీవల పదేపదే దేశ రాజధాని ఢిల్లీ వెడుతున్నారు. పదేపదే ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ అవుతున్నారు. తెలుగు రాష్ట్రలలో భారతీయ జనతా పార్టీకి దూతగా వ్యవహరిస్తున్న గవర్నర్ నరసింహన్‌ తోను పలు మార్లు భేటీ అవుతున్నారు. గంటల సేపు చర్చలు జరుపుతున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల వారి ఈ భేటీల వెనుక ఏమున్నదో అని రాజకీయ పార్టీలలోను - ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిలోను ఆందోళన కలిగిస్తోంది. నిజానికి కేంద్రంతో ఇంత కలివిడిగా ఉండాల్సిన అవసరం కేసీఆర్‌ కు లేదు. ఇటీవల కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెట్టిన సంద‌ర్భంలోను ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర రావును ప్రసంసించారు. సందట్లో సడేమియాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై విమర్శలు గుప్పించారు. దీంతో చంద్రబాబు నాయుడు "ప్రధాని గారు మీ పొగడ్తలు మాకు అవసరం లేదు కేసీఆర్‌ తో నన్ను పోల్చాల్సిన అవసరమూ లేదు " అని మండిపడ్డారు.

జాతీయ స్థాయిలో త‌న‌కు తిరుగులేదు అని చెప్పుకునే చంద్ర‌బాబు... త‌న శిష్యుడు చేస్తున్న రాజ‌కీయాలు అంతుప‌ట్ట‌క ఆందోళ‌న‌కు గుర‌వుతున్నారు. ఏదో కుట్ర జరుగుతోందని అనుమాన‌ప‌డుతున్నారు. రాజ‌కీయాల్లో కుట్ర‌లుండ‌వు అన్నీ రాజ‌కీయాలే అని 40 ఏళ్ల సీనియ‌ర్ కు తెలియ‌క‌పోవ‌డం విచిత్రం. అయినా ఎవ‌రైనా రాజ‌కీయ వ్యూహాలు అంద‌రికీ చెప్ప‌రు క‌దా. ర‌హ‌స్యాల‌న్నీ కుట్ర‌లు అనుకుంటే ఎలా? చిత్రం ఏంటంటే.. ఆ అనుమానాలకు అతికినట్లుగా తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు త‌ర‌చూ ర‌హ‌స్య మంత‌నాలు చేస్తున్నారు.

తెలంగాణలో కేసీఆర్ పాలనపై కేంద్ర మంత్రులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఈ పరిణామాలు చంద్రబాబు నాయుడికి నిద్ర లేకుండా చేస్తున్నాయి. తాజాగా కేసీఆర్ మరోసారి ఢిల్లి పయనమయ్యారు. తెలంగాణలో బిసీ కులాల గణన ప్రారంభిస్తామన్న కొన్నాళ్లకే కేంద్ర ప్రభుత్వం బిసీ కమిషన్‌కు రాజ్యాంగ‌ హోదా కల్పిస్తూ బిల్లు తెచ్చింది. ఇది యాదృచ్చిక‌మే అయినా దీని వెనుక ఓ మతలబు ఉందని పరిశీలకులు అంటున్నారు. తెలంగాణ సీఎంవో ప్రెస్ నోట్లో *ఢిల్లీలో ప్రధానిని - తెలంగాణ ముఖ్యమంత్రి కలిసి తెలంగాణలో ప్రవేశ పెట్టిన జోనల్ విధానంపై చర్చిస్తారు. తెలంగాణకు ప్రత్యేక హోదా కల్పించాలంటూ కోరాతారు* అని పేర్కొన్నారు. పైకి ఇలాంటి అంశాలే కనిపించినా, వీరిద్దరి భేటి వెనుక అసలు కారణాలు మాత్రం రాజకీయ పరమైనవే అంటున్నారు పరిశీలకులు.

ప్రధాని నరేంద్ర మోదీ - ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుల ఉమ్మడి శత్రువు చంద్రబాబే కావడంతో వీరిద్దరి భేటిపై తెలుగుదేశం పార్టీలో చర్చ జరుగుతోంది. అలాగే కేసీఆర్ గవర్నర్‌ ను కలవడం కూడా పచ్చ పార్టీ వారికి గుబులు పుట్టిస్తోంది. మరోవైపు ప్రధాని - ముఖ్యమంత్రుల భేటి వైఎస్‌ ఆర్ సీపీ అధ్యక్షుడు వై.ఎస్. జగన్ మోహాన రెడ్డికి కలిసొచ్చే అంశం. జగన్ పట్ల కె. చంద్రశేఖర రావుకు ఒక న‌మ్మ‌కం ఉంది. జ‌గ‌న్ కేసీఆర్ స్నేహాన్ని కోరుకోక‌పోయినా ఎందుకో జ‌గ‌న్ వ‌స్తే మేల‌న్న సాఫ్ట్ కార్న‌ర్ కేసీఆర్ క‌న‌బ‌రుస్తూ ఉంటారు. 2014 ఎన్నికల ఫలితాల ముందు " ఇక్కడ మనం అక్కడ జగన్ " అని కేసీఆర్ బ‌హిరంగంగా ప్రకటించారు. అంతే కాదు జగన్ పై విమ‌ర్శ‌ల‌ను తిప్పికొడుతూ... ఏమైనా సంఘ వ్యతిరేక శక్తా అని కూడా అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ లో రాజకీయ పరిస్థితిని ప్రధాని నరేంద్ర మోదీకి కేసీఆర్ వివరించనున్నారు. మొత్తానికి ఏదో ఒక ఇష్యూతో చంద్ర‌బాబుకు కేసీఆర్ నిద్ర లేకుండా చేస్తున్నారు.