Begin typing your search above and press return to search.

వాళ్లేం పీకార‌ని ఎంపీల‌కు స‌న్మానం బాబు?

By:  Tupaki Desk   |   29 July 2018 4:51 AM GMT
వాళ్లేం పీకార‌ని ఎంపీల‌కు స‌న్మానం బాబు?
X
ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు తెలివి గురించి తెలిసిందే. మాయ‌గా వ్య‌వ‌హ‌రించ‌టంలో ఆయ‌న త‌ర్వాతే ఎవ‌రైనా అన్న మాట ప‌లువురి నోట వినిపిస్తూ ఉంటుంది. తాజాగా మ‌రోసారి త‌న తీరును త‌న చేష్ట‌తో చెప్పేశారు బాబు. త‌మ పార్టీ నేత ఒక‌రు దీక్ష చేస్తుంటే.. పార్టీ ఎంపీలు ఢిల్లీలో కులాశాగా కూర్చొని.. నాకో ఐదు కేజీల బ‌రువు త‌గ్గాల‌ని ఉంది? ఏదైనా దీక్ష చెప్పండంటూ లీకైన వీడియోతో టీడీపీ ఎంపీల ప‌రువు బ‌జార్లో ప‌డింది.

మోడీపై పెట్టిన అవిశ్వాస తీర్మానం సంద‌ర్భంగా ఎంపీలు గల్లా జ‌య‌దేవ్‌.. రామ్మోహ‌న్ నాయుడుల కార‌ణంగా కొంతైనా ప‌రువు నిల‌బ‌డింది. అవిశ్వాసంపై చ‌ర్చ జ‌రిగిన సంద‌ర్భంగా చివ‌ర్లో కేశ‌నేని నానికి మాట్లాడే అవ‌కాశం ఇవ్వ‌టం ద్వారా.. స్టార్టింగ్ లో మోడీ స‌ర్కారును సూటిగా ప్ర‌శ్నించిన తీరును ప్యాచ‌ప్ చేసిన‌ట్లుగా క‌నిపించింది.

మొత్తంగా చూస్తే.. మోడీపై అవిశ్వాసం ఎపిసోడ్ లో టీడీపీ ప్ర‌ముఖంగా ప్ర‌స్తావించిన ఏపీకి ప్ర‌త్యేక హోదా అంశాన్ని జాతీయ స్థాయిలో చ‌ర్చ జ‌రిగేలా చేయ‌టంలో ఫెయిల్ అయ్యార‌ని చెప్పాలి. అవిశ్వాసం పెట్టిందే ఏపీ ప్ర‌త్యేక హోదా మీద అయిన‌ప్పుడు.. జాతీయ పార్టీల‌తో పాటు.. ప్రాంతీయ పార్టీలు సైతం ఏపీకి ప్ర‌త్యేక హోదాను స‌మ‌ర్థిస్తూ మాట్లాడింది లేదు. దీనికి కార‌ణం బాబు ఎంపీలు స‌రిగా వ్య‌వ‌హ‌రించ‌క‌పోవ‌ట‌మే.

ఏపీకి ప్ర‌త్యేక హోదా అవ‌స‌రాన్ని చెప్ప‌టంతో పాటు.. విభ‌జ‌న కార‌ణంగా ఏపీకి జ‌రిగిన న‌ష్టాన్ని జాతీయ స్థాయిలో ఏ పార్టీ కూడా బ‌లంగా గ‌ళం విప్ప‌లేదంటే.. దానికి కార‌ణం.. బాబు స‌ర్కారు ఆ మేర‌కు విఫ‌ల‌మైంద‌ని చెప్పాలి. మ‌రిన్ని వైఫ‌ల్యాల్ని త‌మ ఖాతాలో వేసుకున్న ఏపీ టీడీపీ ఎంపీల‌కు చంద్ర‌బాబు ఏ రీతిలో స‌న్మానం చేస్తారు? అన్న‌ది అస‌లు ప్ర‌శ్న‌. దీనికి స‌మాధానం చెప్ప‌ని బాబు అండ్ కో.. అందుకు భిన్నంగా ఘ‌నంగా స‌త్క‌రించ‌టం చూస్తే.. అవాక్కు అవ్వాల్సిందే. త‌మ ఎంపీల చేత‌కానిత‌నాన్ని క‌వ‌ర్ చేసేందుకు.. త‌మ ఎంపీలు వీరులు.. శూరులు అని గొప్ప‌లు చెప్పుకోవ‌టానికి.. అవిశ్వాసంపై ఏదో చేశామ‌న్న భావ‌న‌ను క‌లుగ‌జేయ‌టానికి వీలుగా ఈ స‌న్మానం కార్య‌క్ర‌మాన్ని బాబు పెట్టార‌ని చెబుతున్నారు.