Begin typing your search above and press return to search.
షర్మిలపై చంద్రబాబు అక్కసు!
By: Tupaki Desk | 22 Jan 2019 9:49 AM GMTఆడవారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టింది టీడీపీ పార్టీయేనని గొప్పలు చెప్పుకునే టీడీపీ నేతలు... షర్మిలపై చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యలను ఎలా స్వీకరించాలో తెలియక ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఎన్నికల అనంతరం అధికార మార్పిడి తథ్యమని తేలిపోవడంతో చంద్రబాబు రోజురోజుకు దిగజారి విమర్శలు చేస్తున్నారు. తాజాగా షర్మిలపై ఆరోపణలు చేస్తూ అందరి దృష్టిలో చులకన అయిపోతున్నారు.
ఇటీవల షర్మిల సోషల్ మీడియాలో తనపై తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. చంద్రబాబు-టీడీపీ నేతలే తనపై దుష్పచారం చేస్తున్నారని ఆమె తెలంగాణ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారంతా వణికిపోతున్నారు. మరోవైపు జగన్ పై హత్య కేసు విషయంలోనూ చంద్రబాబుకు కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆ కేసు ఎన్ ఐఏ పరిధిలోకి వెళ్లడంతో చంద్రబాబు వారివురిపై సమయం దొరికనప్పుడల్లా అక్కసు వెళ్లగక్కుతున్నారు.
ఏపీలో పింఛన్ల పెంపుదలను పక్కదారి పట్టించేందుకే షర్మిల ఇలా డ్రామా ఆడుతుందని చంద్రబాబు ఆరోపిస్తున్నారు. మరీ ఏ ఆడకూతురైనా తన పరువును ఫణంగా పెట్టి మీడియాకు ఎక్కుతుందా అనేది చంద్రబాబు ఆలోచించుకోవాలి? ఆడవారి ఆత్మగౌరవాన్ని తామే కాపాడుతున్నమంటూ చెప్పుకునే టీడీపీ అధినేత ఇలా దిగజారి వ్యాఖ్యలు చేయడాన్ని సొంత పార్టీ నేతలే హర్షించడం లేదు. ఇలాంటి వ్యాఖ్యలు పార్టీకి చేటు చేస్తాయని సీనియర్లు బాబుకు చెబుతున్నా పట్టించుకోవడం లేదు. ఎన్నికల వేళ దిగజారి వ్యాఖ్యలు చేస్తున్న బాబు తన గోతిని తానే తవ్వుకుంటున్నాడని పలువురు అభిప్రాయ పడుతున్నారు. ఎన్నికలు దగ్గరపడుతుండటంతో ఏపీలో రాజకీయాలు మరింత వేడెక్కడం ఖాయం కనిపిస్తుంది. విమర్శలు ప్రతివిమర్శలు తారాస్థాయికి చేరేలా ఉన్నాయి.