Begin typing your search above and press return to search.
కుంపట్లు తట్టుకోలేక పార్టీ నేతపై బాబు నిప్పులు
By: Tupaki Desk | 29 July 2017 1:00 PM GMTతెలుగుదేశం పార్టీ నేతల్లో సఖ్యత లోపిస్తుందనేందుకు - పార్టీ అధినేత మాటలను సైతం టేకిట్ ఈజీగా తీసేసేకుంటున్నారనేందుకు ఇటీవల పలు ఉదాహరణలు తెరమీదకు వస్తున్నాయి. తాజాగా జరుగుతున్న ఉదంతం దీనికి తారాస్థాయికి చేరిందని అంటున్నారు. అనంతపురం జిల్లా పరిషత్ చైర్మన్ చమన్ రాజీనామా వ్యవహారం టీడీపీలో అంతర్గతంగా కుంపటి రాజేస్తున్నట్లు తెలుస్తోంది. ఒప్పందం మేరకు చైర్మన్ పదవికి రాజీనామా చేయకుండా కాలయాపన చేస్తుండటం, అధిష్ఠానం ఆదేశాలను బేఖాతరు చేస్తూ వ్యవహరిస్తుండటం పార్టీకి నష్టం కలిగించేలా ఉందని జిల్లా పార్టీ నేతల్లో చర్చ జరుగుతోంది.
మాజీ మంత్రి దివంగత పరిటాల రవికి చమన్ కుడిభజంగా ఉండేవారు. అప్పట్లో అనేక వివాదాల్లో చమన్ ఉండటం, కేసులు నమోదు కావడం, అజ్ఞాత జీవితం గడపడం వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. అజ్ఞాతం వీడి బయటకు వచ్చిన నేపథ్యంలో 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చింది. ఈ పరిస్థితుల్లో చమన్ జెడ్పీటీసీ ఎన్నికల్లో పోటీకి దిగారు. ఈ నేపథ్యంలో జడ్పీ చైర్మన్ పదవికి పోటీ పడటంతో స్వయంగా సీఎం చంద్రబాబు వద్దంటూ అప్పట్లో కరాఖండీగా చెప్పారని పార్టీ వర్గాలు అంటున్నాయి. అయితే మంత్రి పరిటాల సునీత అండగా ఉండటం, ఆమెకు తోడు కాలవ శ్రీనివాసులు - జిల్లా అధ్యక్షుడు - పెనుకొండ ఎమ్మెల్యే పార్థసారధి కలిసి సీఎంను ఒప్పించారు. జడ్పీ చైర్మన్ గా పూల నాగరాజు - చమన్ మధ్యే పోటీ నెలకొంది. దీంతో జడ్పీటీసీ అభ్యర్థుల్ని గెలిపించుకునే బాధ్యత ఇరువురిపైనా జిల్లా నేతలు పెట్టారు. ఈ క్రమంలో అత్యధిక స్థానాలు టీడీపీ కైవసం చేసుకోవడంతో చైర్మన్ పదవిలో చెరో రెండున్నరేళ్ల పాటు కొనసాగేలా ఒప్పందం కుదుర్చుకున్నారు.
అయితే కాల పరిమితి పూర్తయినా చమన్ ఏదో ఒక సాకు - ఎత్తుగడతో రాజీనామాను వాయిదా వేస్తుండటంతో జిల్లా నేతల్లో అసహనం పెరిగిపోతోంది. అప్పట్లో మద్దతు ఇచ్చిన తాము అధినేతకు ఏమని చెప్పుకోవాలి? అంటూ సన్నిహితుల వద్ద ప్రస్తావిస్తున్నారు. ఇంకా ఎన్ని రోజులు ఇలా? పదవి ఒక్కటే పరమావధి కాదు కదా? మాట ప్రకారం రాజీనామా చేయకుండా ఏమిటీ కుంటి సాకులు? పార్టీ ముఖ్యం కానీ, పదవులు కాదు.. క్రమశిక్షణ ఉల్లంఘన క్షమించరానిది అంటూ చర్చించుకుంటున్నారు. అంతేకాకుండా.. అధిష్ఠానం అనుకుంటే ఎంత సేపు? పుట్టపర్తి నగర పంచాయతీ చైర్మన్ పీసీ గంగన్నపై వేటు వేయలేదా? అని పార్టీ అధినేత చంద్రబాబు తీరును ఉటంకిస్తుండటం విశేషం. చైర్మన్ పదవికి రాజీనామా చేయకుండా తనకు కనిపించవద్దని చమన్ కు సీఎం చంద్రబాబు సీరియస్ గా చెప్పారని గతంలో వార్తలు విచ్చిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. కాగా, తెగేదాకా లాగి పార్టీలో భవిష్యత్తు కోల్పోయే పరిస్థితి రానీయకూడదంటూ చర్చించుకోవడం గమనార్హం.