Begin typing your search above and press return to search.

జేసీపై బాబు నిప్పులు చెరిగార‌ట‌

By:  Tupaki Desk   |   17 Jun 2017 1:39 PM GMT
జేసీపై బాబు నిప్పులు చెరిగార‌ట‌
X
క్ర‌మ‌శిక్ష‌ణ అనేది క‌రువైపోయిన పార్టీలోని ప‌రిణామాల‌పై ఎట్ట‌కేల‌కు తెలుగుదేశం పార్టీ అధినేత‌ - ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు స్పందించారు. జిల్లా అంత‌ర్గ‌తంగా విమ‌ర్శ‌ల ప‌ర్వాలు - బ‌హిరంగంగా ర‌చ్చ‌కు దిగ‌డం వంటి ప‌నులు పార్టీ ప‌రువును గంగపాలు చేస్తున్న నేప‌థ్యంలో చంద్ర‌బాబు ఆగ్ర‌హ రూపం దాల్చార‌ని టీడీపీ శ్రేణులు అంటున్నాయి. ఇటీవ‌ల తీవ్ర ర‌చ్చ‌గా మారిన కీల‌క జిల్లాల‌యిన అనంత‌పురం, క‌ర్నూలులోని ప‌రిణామాల‌పై బాబు స‌మావేశం ఏర్పాటు చేశారు. ఈ సంద‌ర్భంగా త‌న‌దైన శైలిలో అస‌హ‌నం వ్య‌క్తం చేశార‌ని స‌మాచారం.

ముందుగా అనంతపురం జిల్లా నేతలతో సీఎం చంద్రబాబునాయుడి సమీక్ష నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా విశాఖ ఎయిర్‌ పోర్టులో ఎంపీ జేసీ దివాక‌ర్ రెడ్డి వీరంగంపై ఈ సమీక్షలో ప్ర‌ధానంగా ప్రస్తావించారు. ఎన్ని మంచిపనులు చేస్తున్నా జేసీ లాంటి కొంతమంది నేతలు చేస్తున్న చర్యలతో పార్టీకి చెడ్డపేరొస్తుందని చంద్ర‌బాబు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. రూ.వేలకోట్లు ఖర్చు పెడుతున్నా ఫలితం కనిపించడం లేదంటూ బాబు ఆవేదన చెందారు. వివాదాల‌తో, విభేదాలతో రోడ్డున పడ్డ నేతలకు వచ్చే ఎన్నికల్లో టిక్కెట్లు ఇచ్చేది లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ సంద‌ర్భంగా పార్టీ ప‌ద‌వుల‌పైనా చ‌ర్చించారు. అనంతపురం జిల్లా జడ్పీ చైర్మన్‌ గా పోల నాగరాజు పేరును ఖరారు చేస్తూ, ప్రస్తుత జెడ్పీ చైర్మన్‌ చమన్‌ రాజీనామా చేయాల్సిందిగా చంద్రబాబు ఆదేశించారు.

అనంత‌రం కర్నూల్‌ జిల్లా నేతలతో సీఎం చంద్రబాబునాయుడు త‌న నివాసంలో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి మంత్రులు కాలువ‌ శ్రీనివాసులు - భూమా అఖిలప్రియ - ఎంపీ టీజీ వెంకటేశ్‌ - ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డి హాజరయ్యారు. పార్టీ సమన్వయం, జిల్లా నేతల్లో నెలకొన్న విబేధాలు - నంద్యాల ఉపఎన్నిక పై సమావేశంలో చర్చిస్తున్నారు. ఈ సంద‌ర్భంగా మంత్రి అఖిల‌ప్రియ అంద‌రితో క‌లుపుగోలుగా ఉండాల‌నే మాట‌ను సీఎం చంద్ర‌బాబు తేల్చిచెప్పిన‌ట్లు స‌మాచారం. సీనియ‌ర్ నేత‌ల‌ను కలుపుకొని వెళ్లేందుకు మంత్రి ప్రాధాన్యం ఇవ్వాల‌ని సూచించిన‌ట్లు తెలెస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/