Begin typing your search above and press return to search.

మంత్రుల‌పై బాబు ఫైరింగ్ చూశారా?

By:  Tupaki Desk   |   21 Jun 2016 12:51 PM GMT
మంత్రుల‌పై బాబు ఫైరింగ్ చూశారా?
X
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రులపై మ‌రోమారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ద‌ఫా అధికారులపై కూడా బాబు మండిప‌డ్డారు. పని తీరు మార్చుకోవాలని, ఇదే రీతిలో వెలితే అభివృద్ధిలో ముందుకుపోవ‌డం సాధ్యం కాద‌ని సూచించారు. నేతల్లో అహంకారాలు పెరిగిపోయాయని బాబు అభిప్రాయపడ్డారు.

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు మంత్రులు - ఎమ్మెల్యేలు - కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఉద్యోగుల బదిలీలు - మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికలపై సమీక్షించారు. ఈ సంద‌ర్భంగా ఉద్యోగుల బదిలీల తీరుపై చంద్ర‌బాబు ఒకింత అసహనం వ్యక్తం చేశారు. 2016-17 ఆరంభానికి ముందే విద్యాశాఖలో బదిలీ చేయాల్సిందని అన్నారు. ప్రభుత్వం ప్రతి ఉద్యోగితో పని చేయించుకోవాలంటే బదిలీలు తప్పవని చంద్రబాబు అన్నారు. ప్రభుత్వ పాలనలో ఉత్తమ బృందాల ఎంపిక కోసమే బదిలీలు చేపడుతున్నామని అన్నారు. మంత్రులు - అధికారుల మధ్య సమన్వయ లోపం వల్లే సమస్యలు తలెత్తుతున్నాయని మండిపడ్డారు. ఒత్తిళ్లతో ఇష్టానుసారం బదిలీలు చేస్తే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని, బదిలీ మార్గదర్శకాలను కచ్చితంగా అనుసరించాలని స్పష్టం చేశారు. ఏజెన్సీ ప్రాంతాల్లో పని చేసేందుకు ముందుకొచ్చే ఉద్యోగులకు ప్రోత్సాహకాలు ఉంటాయని అన్నారు.

ఇటీవ‌ల కొంద‌రు మంత్రులు - ఎమ్మెల్యేలు త‌మ వారికి ప్రాధాన్య పోస్టులు ద‌క్కాల‌ని ప్ర‌భుత్వంపై ఒత్తిడి తీసుకువ‌చ్చారు. అంతేకాకుండా ప‌లువురికి త‌ప్ప‌నిస‌రి బ‌దిలీ చేయాల‌ని ఉన్న‌తాధికారుల‌పై హుకుం జారీచేశార‌ని వార్త‌లు వ‌చ్చాయి. ఈ నేప‌థ్యంలో బ‌దిలీ ప్ర‌క్రియ నిలిచిపోయినంత ప‌న‌యింది. ఈ ప‌రిణామాల‌న్ని గ‌మ‌నించిన సీఎం చంద్ర‌బాబు తాజాగా టెలీకాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశార‌ని అంటున్నారు.