Begin typing your search above and press return to search.
వైసీపీ పాదయాత్ర చేయొచ్చా.. చంద్రబాబు ఫైర్
By: Tupaki Desk | 7 Nov 2021 12:30 PM GMTఅమరావతి రాజధానిని నిలబెట్టుకునే లక్ష్యంతో ఇక్కడి రైతులు, మహిళలు చేస్తున్న పాదయాత్రకు పోలీ సులు నోటీసుల రూపంలో అడ్డు చెప్పేందుకు ప్రయత్నించడంపై.. సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. కరోనా నిబంధనలు.. హైకోర్టు నిబంధనలు పాటించడం లేదంటూ.. రైతులకు ప్రకాశం జిల్లా పోలీసులు.. నోటీసులు ఇచ్చారు. దీనిపై సర్వత్రా విమర్శలు రావడంతోపాటు.. విస్మయం కూడా వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో తాజాగా స్పందించిన టీడీపీ అధినేత చంద్రబాబు.. పోలీసుల తీరు, ప్రభుత్వ వైఖరిపై నిప్పులు చెరిగారు.
అమరావతి రైతుల పాదయాత్రకు ప్రజలు నుంచి వస్తున్న మద్దతు చూసి వైసీపీ ఓర్వలేక పోతోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే పాదయాత్రకు అడుగడుగునా అడ్డంకులు, అవరోదాలు కల్పిస్తోందని నిప్పులు చెరిగారు. పోలీసులను అడ్దుపెట్టుకుని ఉక్కుపాదం మోపుతోందని అన్నారు. కోర్టు అనుమతి ఇచ్చిన మహా పాదయాత్రను అడ్డుకునేందుకు ప్రయత్నించడం హేయమైన చర్యగా చంద్రబాబు పేర్కొన్నారు. పాదయాత్రను కోవిడ్ ఆంక్షల పేరుతో అడ్డుకోవడం సమంజసం కాదన్నారు.
గతంలో జగన్ చేసిన ప్రజాసంకల్ప యాత్రకు 4 ఏళ్ళు నిండాయనే పేరుతో.. శనివారం వైసీపీ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్రలు చేసి బహిరంగ సభలు పెట్టారని గుర్తు చేసిన చంద్రబాబు వారికి లేని కరోనా నిబంధనలు రైతుల పాదయాత్రకు వర్తిస్తాయా? అని నిలదీశారు. సీఎం జగన్‌కు ప్రజా వ్యతిరేకత పెరుగుతుండటంతో ప్రజల్ని పోలీసులతో అణగ దొక్కుతున్నారని మండిపడ్డారు. ఇప్పటికే రాజధాని అమరావతిని నిర్వీర్యం చేసి 5 కోట్ల మంది భవిష్యత్తుని అంధకారంలోకి నెట్టి క్షమిoచరాని తప్పు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 5 కోట్ల మంది ఆకాంక్షలకు అనుగుణంగా రైతులు చేస్తున్న పాదయాత్రను అడ్డుకుని చరిత్ర హీనులుగా మిగిలిపోవద్దని హితవు పలికారు. ఈ మేరకు తాజాగా చంద్రబాబు ఒక ప్రకటన జారీ చేశారు.