Begin typing your search above and press return to search.
మోడీని తిట్టలేక బ్యాంకర్లను తిడుతున్న బాబు
By: Tupaki Desk | 28 Nov 2016 1:35 PM GMTపెద్ద నోట్ల రద్దుతో ప్రజలు పడుతున్న ఇబ్బందులకు బ్యాంకర్లే కారణమంటూ ఏపీ సీఎం చంద్రబాబు వారిపై విరుచుకుపడుతున్నారు. ప్రజల సమస్యలు తీర్చడానికి బ్యాంకర్లు ఏమాత్రం కృషి చేయడం లేదంటూ ఆయన వారిపై మండిపడుతున్నారు. తాజాగా ఆయన బ్యాంకర్లు - అధికారులతో సమావేశమైన సందర్భంగా తీవ్ర పదజాలంతో వారిపై విరుచుకుపడ్డారు. ప్రజల జీవితాలతో ఆడుకోవడం మంచిది కాదన్నారు.
పెద్దనోట్ల రద్దు అనంతర పరిస్థితులను చక్కదిద్దడంలో బ్యాంకర్లు విఫలమయ్యారని చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. బ్యాంకులు - ఏటీఎంల వద్ద ప్రజలు ఇప్పటికీ పడిగాపులు కాస్తున్న పరిస్థితి తలెత్తుతోందని అన్నారు. బ్యాంకర్ల సహాయ నిరాకరణ కారణంగా ప్రభుత్వం కూడా ఏం చేయలేని పరిస్థితులు నెలకొన్నాయన్నారు. బ్యాంకులను సమన్వయం చేయాల్సిన ఆర్బీఐ - ఆ విషయంలో విఫలమైందని - సమావేశాలకు హాజరవుతున్న బ్యాంకుల ప్రతినిధుల వద్ద సరైన సమాచారం ఉండటం లేదని బాబు మండిపడ్డారు. సరైన సమాచారం లేకుండా సమీక్షలు నిర్వహిస్తే ఉపయోగం ఏముంటుందని చంద్రబాబు ప్రశ్నించారు.
నిజానికి బ్యాంకర్ల తప్పు ఇందులో ఎంత ఉందని ప్రశ్నించుకుంటే చంద్రబాబు అనవసరంగా వారిపై మండిపడుతున్నారని అర్థమవుతోంది. ఆర్బీఐ నుంచి నగదు రాకుంటే బ్యాంకర్లు ఏమీ చేయలేని పరిస్థితి. ఇప్పుడు అదే జరుగుతోంది. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం వెలువడిన వెంటనే నగదు మార్పిడికి - డిపాజిట్లకు ప్రభుత్వం అవకాశం ఇవ్వడంతో బ్యాంకులు రాత్రీపగలు నిద్రలేకుండా పనిచేశాయి. అదనపు కౌంటర్లు ఏర్పాటు చేసి నడుం ఎత్తకుండా నిర్విరామంగా పనిచేశారు. కానీ... బ్యాంకుల్లో నగదు నిల్వలు అయిపోవడం... కొత్తగా నగదు ఆర్బీఐ నుంచి రాకపోవడంతో వారిప్పుడు ఎవరికీ డబ్బులు ఇవ్వలేని పరిస్థితి. దీంతో కేవలం పాత నోట్ల డిపాజిట్లకే పరిమితం అవుతున్నారు. అలాంటప్పుడు బ్యాంకర్లను మందలించడం వల్ల ప్రయోజనం ఏముంటుందన్నది చంద్రబాబుకే తెలియాలి.
కాగా, చంద్రబాబుతో సమావేశం తరువాత కొందరు బ్యాంకర్లు బహిరంగంగానే తమ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆర్బీఐ నుంచి నగదు రాకుండా తామేం చేయగలమంటున్నారు. చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే కేంద్రంపై ఒత్తిడి చేసి ఏపీలో బ్యాంకులకు డబ్బు అందేలా చూడాలంటున్నారు. అంతేకాదు.. కొందరైతే మరో అడుగు ముందుకేసి.. చంద్రబాబు హెరిటేజ్ తో ఒప్పందాలు చేసుకున్న బిగ్ బజార్లలో నగదు మార్పిడికి డబ్బులు రిలీజ్ చేస్తున్నారు. అది ఎవరికి చేరుతుందో ఏమో అంటూ అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. అదేదో బ్యాంకులకే ఇస్తే తాము ప్రజలకు అందేలా ఏర్పాట్లు చేస్తామంటున్నారు. మోడీని ఏమీ అనలేక తమను అంటే లాభం లేదని అంటున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/