Begin typing your search above and press return to search.
బాబులో ఈ యాంగిల్ మీరెప్పుడూ చూసి ఉండరు?
By: Tupaki Desk | 1 Feb 2019 10:58 AM GMTఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు గుర్తుకు వచ్చినంతనే ఆయన సీరియస్ గా ఉంటారే కానీ.. ఆయన నోరు విప్పితే చప్పటి మాటలు వినిపిస్తూ ఉంటాయి. పసుపు రంగు ఫ్యాంట్.. షర్ట్ వేసుకునే ఆయనలో దాదాపుగా కొత్తదనంగా కనిపించరు. అలాంటి చంద్రబాబు బ్లాక్ షర్ట్ వేసుకోవటం అన్నది దాదాపుగా చూసి ఉండరు.
ఈ రోజు ఏపీ అసెంబ్లీకి బ్లాక్ షర్ట్ వేసుకొని వచ్చిన ఆయన బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజుపై నిప్పులు చెరిగారు. పాత్రికేయ వృత్తిలో ఉన్న చాలామంది.. అందునా పొలిటికల్ రిపోర్టింగ్ చేసే వారంతా ఘాటుగా మాట్లాడితే నిప్పులు చెరిగారన్న పదాన్ని అదే పనిగా వాడేస్తుంటారు. కానీ.. నిప్పులు చెరిగేలా మాట్లాడటం అంటే ఏమిటో ఈ రోజు ఏపీ అసెంబ్లీలో చంద్రబాబు తన మాటలతో చూపించారని చెప్పాలి. ఏపీకి కేంద్రం చేసిన సాయం గురించి జరిగిన చర్చ సందర్భంగా ఈ సన్నివేశం చోటు చేసుకుంది.
ఎన్నికలు దగ్గరకు రావటం.. కేసీఆర్.. మోడీ జట్టుగా కలిసి ఏపీ విపక్ష నేత జగన్ కు దన్నుగా ఉన్నారన్న వార్తల నేపథ్యంలో బాబులో కోపం కట్టలు తెంచుకుంది. దీనికి తోడు.. ఏపీకి మోడీ సర్కారు ఇవ్వని నిధుల గురించి గొప్పలు చెబుతున్న విష్ణుకుమార్ రాజు మాటలు విన్నంతనే బాబు ఫైర్ అయ్యారు. గతంలో ఎప్పుడూ లేని రీతిలో ఆయన కోపాన్ని చూసిన తెలుగుదేశం నేతలు సైతం విస్మయానికి గురైన పరిస్థితి.
వైఎస్ కు.. చంద్రబాబుకు మధ్య జరిగిన మాటల యుద్ధంలోనూ ఇంతలా ఆగ్రహం వ్యక్తం చేయని చంద్రబాబు.. తాజాగా విష్ణుపై మాటల నిప్పులు కురిపించారు. అంతేనా.. ఎమ్మెల్యేగా ఉండే అర్హత లేదంటూ కసిరారు. సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారన్న మాటతో పాటు.. ఏం చేస్తారు? జైల్లో వేస్తారు? అంతేనా అనే వరకు బాబు వెళ్లారంటే ఆయన ఆగ్రహం ఏ స్థాయిలో ఉందో ఇట్టే చెప్పొచ్చు. ఏపీకి కేంద్రం చేసిన సాయం ఏమిటో చెప్పాలని నిలదీసిన బాబు.. తెలుగువాళ్లకు పౌరుషం లేదని అనుకుంటున్నారా? అంటూ ధ్వజమెత్తారు.
ఏపీ అసెంబ్లీలో బాబు చేసిన ఆగ్రహ ప్రసంగంలోని కొన్ని ముఖ్యమైనవి ఆయన మాటల్లోనే చెబితే..
+ రాష్ట్రం నష్టపోతే ఆవేదన ఉండదా? తమిళనాడు, గుజరాత్ రాష్ట్రాలకు ఎన్ని నిధులిచ్చారో.. వాటిని ఒకసారి ఏపీతో పోల్చి చూడండి.
+ ఎవరికోసం నిధులిస్తారు. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, దిల్లీలో ఎన్ని సంస్థలు ఉన్నాయి. ఎవరబ్బ సొమ్ము అనుకుంటున్నారు. వినేవాళ్లు ఉంటే మీ ఇష్టప్రకారం మాట్లాడతారు.
+ సాధారణ పౌరుడుకి ఉండే ఆసక్తి.. ప్రజాప్రతినిధిగా ఉండే అర్హత మీకు లేదు. రక్తం ఉడికిపోతోంది. రాష్ట్రంలో ఎవరికి ఊడిగం చేస్తారు? అడిగేవారు లేరనుకుంటున్నారు. సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. ఎమ్మెల్యే గా ఉండటానికి మీరు అన్ ఫిట్.
+ మమ్మల్ని ఏం చేస్తారు? జైల్లో పెడతారా? మీ ఇష్ట ప్రకారం తమాషాలు ఆడుతున్నారు. కొత్త రాష్ట్రం ఏర్పడితే సహకరించాల్సిందిపోయి సిగ్గు వదిలిపెట్టి మాట్లాడుతున్నారు.
+ రాష్ట్రానికి న్యాయం జరిగే వరకూ వదిలిపెట్టం. భాజపా నేతలను తిరగనివ్వం.
+ రోషం లేదా .. తమాషాగా ఉందా.. న్యాయం జరిగేంత వరకు వదిలిపెట్టం. వినేవాళ్లు ఉంటే చెవుల్లో పువ్వు లు పెడతారండి.
+ ఏపీ హక్కుల కోసం మహిళలు వచ్చి.. పోరాడతామంటున్నారు. పెన్షన్ డబ్బులు విరాళంగా ఇస్తున్నారనుకుంటున్నారా? ఆంధ్ర ప్రజలకు పౌరుషం లేదనుకుంటున్నారా?
+ ప్రత్యేక హోదాపై నేను మాట మార్చలేదు. కేంద్రమే తప్పుడు సమచారమిచ్చింది. అన్యాయం చేసింది. 14వ ఆర్థిక సంఘం పేరుతో మోసం చేశారు. ఆ సంఘం చైర్మన్ హోదాపై ఎలాంటి అభ్యంతరం లేదని స్వయంగా చెప్పారు. కానీ ప్రభుత్వం మాత్రం ప్యాకేజీ పేరు చెప్పింది.
+ డబ్బులు ఇవ్వండని అడి గితే అప్పు ఇస్తానంటున్నారు. అప్పు ఇస్తే.. తాను సంపాదించుకోలేనా?
+ మీరు ఇచ్చింది ఏంటి.. మేము పన్నులు కట్టడం లేదా.. నాకు హక్కు లేదా .. నాకు అన్యాయం జరిగినప్పుడు.. నాకు ఎందుకు ఇవ్వరు.. దేశంలో భాగంగా లేమా?
+ తమిళనాడులో, ఈశాన్య రాష్ట్రాల్లో ఎందుకు వ్యతిరేకత వస్తుందో ఆలోచించుకోవాలి. వ్యతిరేకంగా మాట్లాడితే ఫినిష్ చేయాలని చూస్తారు. ఎవరో ఒకరు సాయం చేస్తారనుకున్నాను.
+ హోదా ఇవ్వకపోయినా.. ఏ పేరుతో ఇచ్చినా.. రాష్ట్రాన్ని ఆదుకుంటే సరిపోతుందనుకున్నాను. అన్నీ దిగమింగుకుని .. ఈగోని సంతృప్తి పరుస్తుంటే.. మట్టి, నీళ్లు ముఖాన కొట్టి వెళ్లారు.
+ దక్షిణాది నుంచి ప్రస్తుతం ఏ ఒక్కరైనా కేంద్ర మంత్రిగా ఉన్నారా? అన్యాయం చేసింది కాక.. తిరిగి విమర్శిస్తారా? దక్షిణాది నుంచి కేంద్రమంత్రిగా వెంకయ్య నాయుడు ఉండేవారు. వీళ్లు కోపంతో ఆయన్ను కూడా తీసుకెళ్లి ఉపరాష్ట్రపతిని చేసేశారు.
+ అది పనిష్మెంటా.. ప్రమోషనా అనేది దేవుడికే తెలియాలి. దేశంలో దక్షిణాది భాగం కాదా? కాంగ్రెస్ హయాంలోనూ ఉత్తరాది వారు ప్రధానిగా ఉంటే దక్షిణాది వ్యక్తిని రాష్ట్రపతిగా ఉంచడం వంటివి చేసేవారు. ఈశాన్య రాష్ట్రాలతో సహా సముచిత స్థానం ఇచ్చి గౌరవించేవారు.
+ తెలంగాణ నుంచి కేంద్ర మంత్రిగా ఉన్న దత్తాత్రేయను పదవి నుంచి తొలగించారు. కర్ణాటక నుంచి ఉన్న అనంతకుమార్ మృతి చెందారు. ఒక్క సదానంద గౌడ మాత్రమే మిగిలారు.
+ దక్షిణాదిలో ఎంతమంది మంత్రులకు ఎన్ని ఫోర్ట్‌ఫోలియోలు ఇచ్చారో ఒక్కసారి గుర్తు చేసుకోండి. మనోభావాలను ఎలా కాపాడతారు? ఉపన్యాసాలు ఎలా ఇస్తారు?
+ దక్షిణాదిలో ఖాతా తెరవలేదు. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం గెలుస్తాం అని చెబుతారు. ఎలా గెలుస్తారు? అశాస్త్రీయ విభజన జరిగింది. దిల్లీలో కేంద్ర మంత్రుల ఇంటింటికీ తిరిగాను. ప్రధాని మోదీ ఎక్కడికొస్తే అక్కడ కలిశాను. న్యాయం చేస్తారనే తిరిగాను. నాకోసం తిరగలేదు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఎక్కడా రాజీ పడలేదు. ఈ నేలపై పుట్టిన ప్రతి ఒక్కరూ అంకితభావంతో పనిచేయాలని కోరుతున్నా.