Begin typing your search above and press return to search.
‘నేను రైట్.. ఎవరేం చెప్పినా రాంగే’
By: Tupaki Desk | 24 Feb 2018 6:38 PM ISTముఖ్యమంత్రి చంద్రబాబునాయుడులో ఈ వైఖరి ఇప్పుడు కొత్తగా కనిపిస్తున్నది ఎంతమాత్రమూ కాదు. తాను ఏం చేస్తే అది మాత్రమే కరెక్టు.. తతిమ్మా ఎవ్వరైనా అదే పనిచేసినా కూడా అది తప్పే అని వాదించే నైజం ఆయనది. ఫరెగ్జాంపుల్.. ఇప్పుడు ప్రత్యేకహోదా డిమాండునే తీసుకుంటే.. ఈరోజున ‘ఆ రాష్ట్రాలకు హోదా ఇస్తున్నారు కదా.. మాకెందుకు ఇవ్వరు ఇచ్చి తీరాల్సిందే. పోరాడి సాధిస్తాం’ అంటారు. అదే మాటను వైఎస్ జగన్ నాలుగేళ్లనుంచి చెబుతోంటే.. అంతా డ్రామా అని కొట్టి పారేస్తారు. అలాంటి చంద్రబాబునాయుడు.. రాయలసీమ గురించిన భాజపా డిమాండ్ల విషయంలో కూడా అలాగే స్పందిస్తున్నారు. నేను కూడా రాయలసీమ బిడ్డనే అని డబాయిస్తున్నారు.
భాజపా రాయలసీమ నాయకులంతా సమావేశమై విభజన అనంతర పరిణామాల్లో రాయలసీమ ప్రాంతానికి సమన్యాయం జరగడం లేదని ఆవేదన వెలిబుచ్చారు. రాష్ట్ర హైకోర్టును శాశ్వతంగా రాయలసీమలోనే ఏర్పాటుచేయాలని అంటున్న భాజపా నాయకులు - అంతకంటె ముందుగా రెండో రాజధానిని కూడా అక్కడ ఏర్పాటు చేయాలని అంటున్నారు. ఈవిషయంపై స్పందించిన చంద్రబాబు పైవిధంగా చెప్పడం విశేషం.
రాష్ట్రానికి జరిగిన అన్యాయం విషయంలో కేంద్రంపై పోరాటం చేయాల్సిన అనివార్య పరిస్థితులు నెలకొన్నాయని చంద్రబాబు ఇప్పటికి గుర్తించినట్లుగా ఉంది. పార్టీ నాయకులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సులో అలా పిలుపు ఇచ్చిన చంద్రబాబు - పార్టీలన్నీ రాజకీయ ప్రయోజనాలను పక్కన పెట్టి రాష్ట్ర ప్రయోజనాల గురించి ఆలోచించాలని హితవు చెబుతుండడం విశేషం. చూడబోతే.. తాను ఏం చేస్తే అది మాత్రమే రాష్ట్రప్రయోజనాలకోసం చేసినట్టు, మిగిలిన వారు ఏంచేసినా అది రాజకీయాల కోసం చేసినట్టు అని చంద్రబాబు నిర్వచించేలాగా కనిపిస్తోంది.
బీజేపీ డిమాండు విషయంలో.. భాజపా నాటకాలు ఆడుతున్నదని నిందించిన చంద్రబాబు తాను కూడా రాయలసీమ బిడ్డనే అని పేర్కొనడం విశేషం. అయినా.. ఆయన రాయలసీమ బిడ్డ అని సవాలు విసరడం కాకుండా, గతంలో తొమ్మిదేళ్లు సీఎంగా అధికారం చెలాయిస్తూ రాయలసీమకు ఏం ఒరగబెట్టాడో.. ఆయన కాస్త విపులంగా చెబితే బాగుండేదని విమర్శలు వస్తున్నాయి.