Begin typing your search above and press return to search.
బొండాపై చంద్రబాబు ఫైర్
By: Tupaki Desk | 2 April 2017 3:30 PM GMTఇంతకాలం బాబు ఏం చెబితే వంతపాడటం..ఎంత మాట పడితే అంత మాట అనేయటం.. సీనియర్ ఐపీఎస్ అధికారులపైనా దురుసుగా వ్యవహరించటం లాంటి చేష్టలతో వివాదాస్పద నేతగా తరచూ వార్తల్లోకి టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు.. తాజాగా అధినేత చంద్రబాబుపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేయటం తెలిసిందే. తన దూకుడుతనంతో బాబు మదిని దోచి.. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచినా.. మంత్రి పదవిని సొంతం చేసుకోవాలన్న కలను భారీగా కన్నారు బొండా. అయితే.. అందుకు భిన్నంగా.. ఆయన కలల్ని కల్లలు చేయటంపై అధినేతపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
మంత్రివర్గంలో బెర్త్ పక్కానన్న భావనతో నిన్నటి చెలరేగిపోయిన బొండా.. తాజాగా చంద్రబాబు హ్యాండ్ ఇవ్వటంపై తీవ్రనిరాశకు గురయ్యారు. ఒకదశలో తన ఎమ్మెల్యే పదవికిరాజీనామా చేయాలన్న ఫీలర్ ను బయటకు వదిలారు. అంతేకాదు.. తనకుమంత్రి పదవిని ఇవ్వకపోవటాన్ని కాపులకు జరిగిన అన్యాయంగా ఆయన ఆక్రోశించటంపై బాబు షాక్ తిన్నారని చెబుతున్నారు. బొండా నుంచి ఇలాంటి రియాక్షన్ ను ఊహించని చంద్రబాబు.. ఆయన్ను తన నివాసానికి పిలిపించుకున్నారు.
తనకు మంత్రి పదవి దక్కకపోవటంతో తీవ్రవ్యాఖ్యలు చేస్తున్న బొండాపై చంద్రబాబు సీరియస్ కావటమే కాదు.. కాపులకు గొంతుకోస్తున్నారన్న వ్యాఖ్యలపై తీవ్రఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నట్లుగా చెబుతున్నారు. మంత్రి పదవి ఇవ్వకపోతే.. ఇష్టం వచ్చినట్లుగా వ్యాఖ్యలు చేస్తారా?అంటూ బొండాను నిలదీసినట్లుగా చెబుతున్నారు. ఈ సందర్భంగా బొండాకు చెందిన పలు కబ్జా వివాదాల్ని ప్రస్తావించిన చంద్రబాబుకు ఆయనకు షాకిచ్చినట్లుగా తెలుస్తోంది.
క్రమశిక్షణ లేకుండా సహించేది లేదని.. ఆర్డీఏ కమిషనర్ గన్ మ్యాన్ మీద దాడి చేసినా.. కేసు పెట్టని వైనాన్ని గుర్తు చేస్తూ..మంత్రివర్గంలో స్థానం కల్పించకుంటే కాపు అంశాన్ని తెరపైకి తీసుకొచ్చివివాదం చేస్తారా?అంటూ సీరియస్ అయినట్లుగా తెలుస్తోంది. మొత్తంగా చంద్రబాబు ఆగ్రహం చూసిన బొండా మనసులో తీవ్రఅసంతృప్తి ఉన్నా.. వెనక్కి తగ్గినట్లుగా చెబుతున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/