Begin typing your search above and press return to search.
ట్రంప్ మీద విరుచుకుపడిన చంద్రబాబు
By: Tupaki Desk | 5 Feb 2017 10:14 AM GMTవివాదాలతో తరచూ వార్తల్లో నిలిచే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మీద ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఏడు ముస్లిం దేశాలకు చెందిన ప్రజల్ని అమెరికాలోకి అనుమతించే విషయంలో తీసుకున్న నిర్ణయంపై ఇప్పటికే పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కొంటున్నారు. తాజాగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ట్రంప్ ను తిట్టేసే జాబితాలో చేరిపోయారు. ట్రంప్ విధానాలకు వ్యతిరేకంగా పోరాడుతున్నట్లు చెప్పిన చంద్రబాబు.. ఉపాధ్యాయుల అధికారిక సదస్సులో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఒక వ్యక్తి దేశాన్ని ఎలా నాశనం చేస్తారో ట్రంప్ చూపిస్తున్నారంటూ చంద్రబాబు మండిపడ్డారు. ‘‘ఒక దేశాన్ని ఎంత భ్రష్టుపట్టిస్తారన్న దానికి అమెరికా అధ్యక్షుడు ట్రంపే ఉదాహరణ. ఆయన కారణంగా ఆ దేశం గందరగోళంగా మారింది. అతలాకుతలమైంది’’ అని విమర్శించారు. అనంతరం.. త్వరలో జరగనున్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్నిప్రస్తావించారు. అధికారిక కార్యక్రమం అయినప్పటికీ.. ఎన్నికల ప్రస్తావన తీసుకురావటమే కాదు.. పరోక్షంగా ఉపాధ్యాయులను ఓట్లు అడిగేసిన తీరు పలువురిని విస్మయానికి గురి చేసింది.
ఉపాధ్యాయులకు రెండు ఓట్లు ఉన్నాయని.. వారి సహకారం తనకు కావాలన్నారు. 2004లో తాను ఓడిపోతానని దేశంలో ఎవరూ ఊహించలేదని..అయితే ఉపాధ్యాయుల్లో చాలామంది తనకు వ్యతిరేకంగా పని చేసినట్లుగా వ్యాఖ్యానించారు. ఈసారి తాను అందరిని కలుపుకు వెళుతున్నట్లుగా చెప్పిన బాబు.. ఎన్నికల్లో తనకు సహకారం అందించాలని కోరటం గమనార్హం. విధానాల పరంగా ఒక దేశాధ్యక్షుడ్ని విమర్శించే చంద్రబాబు.. తన పరిధిలో తాను.. నిబంధనలకు భిన్నంగా ఓట్లును అడిగేసిన తీరును పలువురు తప్పు పడుతున్నారు. నీతులన్నవి చెప్పేందుకేనని ఊరికే అనలేదేమో..?
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/