Begin typing your search above and press return to search.

విమానాలు త‌ర్వాత‌.. ఏటీఎంలకే దిక్కులేదు..!

By:  Tupaki Desk   |   12 July 2015 11:41 AM GMT
విమానాలు త‌ర్వాత‌.. ఏటీఎంలకే దిక్కులేదు..!
X
రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత ఏపీ స‌ర్కారు చేప‌ట్టిన అతి పెద్ద‌కార్య‌క్ర‌మం ఏదైనా ఉందంటే అది గోదావ‌రి పుష్క‌రాలే. పన్నేండ‌ళ్ల‌కోసారి వ‌చ్చే పుష్క‌రాల్ని అద్భుతంగా నిర్వ‌హిస్తామ‌ని ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు చెప్పిన‌ప్ప‌టికీ.. ప్ర‌స్తుతం అలాంటి ప‌రిస్థితి లేద‌న్న మాట వినిపిస్తోంది. పుష్క‌రాల ప‌నుల మీద అధికారుల‌తో నిర్వ‌హిస్తున్న స‌మీక్షా స‌మావేశాల్లో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు చిరాకులు.. అగ్ర‌హం చూస్తే.. ప‌రిస్థితి ఏమిటో ఇట్టే అర్థ‌మ‌వుతుంది.
ఓప‌క్క ప‌నులు స‌రిగా జ‌ర‌గ‌క‌పోవ‌టం.. కోట్లాదిగా వ‌చ్చే భ‌క్తుల‌కు స‌దుపాయాలు అర‌కొర మాత్ర‌మే ఉన్నాయ‌న్న అభిప్రాయం నేప‌థ్యంలో తాజాగా కేంద్ర‌మంత్రి అశోక్ గ‌జ‌ప‌తిరాజు మాట‌లు చూస్తే చిత్రంగా అనిపిస్తాయి. విజ‌య‌వాడ నుంచి రాజ‌మండ్రి వ‌ర‌కు విమాన స‌ర్వీసులు నిర్వ‌హించ‌టానికి పెద్ద ఎత్తున సంస్థ‌లు ఆస‌క్తి చూపించాయ‌ని చెప్పుకొచ్చారు.

ఎంత‌సేప‌టికి సంప‌న్నుల‌కు వ‌స‌తుల గురించే త‌ప్పించి సామాన్య‌ల గురించి ప‌ట్టించుకోవ‌టం లేద‌న్న ఆగ్ర‌హం వ్య‌క్త‌మ‌వుతోంది. ఎందుకంటే.. పుష్క‌రాల కోసం ప్ర‌యాణించే బ‌స్సుల్లో ఛార్జీల బాదుడు భారీగా ఉండ‌టం తెలిసిందే. రైల్వేలు సైతం అదే దారిన న‌డుస్తున్న ప‌రిస్థితి.
ఇదిలా ఉంటే.. ఒక‌విష‌యాన్ని అధికారులు.. ప్ర‌భుత్వం అస్స‌లు ప‌ట్టించుకోవ‌టం లేద‌ని.. ఇది చాలా ఇబ్బందిక‌రంగా మారే ప్ర‌మాదం ఉంద‌ని చెబుతున్నారు.

గోదావ‌రి పుష్క‌రాల్లో ప్ర‌ముఖంగా అంద‌రు భ‌క్తులు వ‌చ్చే రాజ‌మండ్రి ప‌ట్ట‌ణంలో ఏటీఎంలు చాలా ప‌రిమితంగా ఉన్నాయ‌న్న ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. ఇవాల్టి రోజున‌.. జేబులో డ‌బ్బులు పెట్టుకొని తిరిగే క‌న్నా.. ఏటీఎం కార్డులు పెట్టుకొని అవ‌స‌ర‌మైన‌ప్పుడు ఏటీఎంల‌లో నుంచి డ్రా చేసుకునే అల‌వాటు పెరిగిపోయింది.

ఇక‌.. దూర ప్ర‌యాణాలు చేసి వ‌చ్చే వారికి.. డ‌బ్బుల అవ‌స‌రం ఎక్కువ‌గా ఉంటుంది. పుష్క‌రాల సంద‌ర్భంగా ఒక్క రాజ‌మండ్రి ప‌ట్ట‌ణానికి ప‌న్నెండు రోజుల వ్య‌వ‌ధిలో దాదాపు నాలుగు కోట్ల మంది యాత్రీకులు వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని అంచ‌నా వేస్తున్నారు.

ఇంత భారీ జ‌న ప్ర‌వాహం వ‌చ్చి రాజ‌మండ్రిని ముంచెత్తే అవ‌కాశం ఉంటే.. ఆ ప‌ట్ట‌ణంలో ఉన్న ఏటీఎంలు కేవ‌లం 96 మాత్ర‌మే. ఇందులో దాదాపు 10 నుంచి 15 శాతం ఏటీఎం సెంట‌ర్లు ఏదో ఒక సాంకేతిక‌స‌మ‌స్య కార‌ణంగా ప‌ని చేయ‌ని దుస్థితి.

ఇలాంటి ప‌రిస్థితుల్లో.. భారీగా వ‌చ్చే యాత్రికుల‌కు త‌గ్గ‌ట్లుగా ప్ర‌త్యేక ఏటీఎం సెంట‌ర్ల‌ను ఏర్పాటు చేయాల్సిన అవ‌స‌రం ఉంది. కానీ.. ప్ర‌భుత్వం కానీ.. బ్యాంకులు కానీ ఆ దిశ‌గా ఏ మాత్రం ఆలోచించ‌న‌ట్లుగా క‌నిపించ‌టం లేదు. ఈ నేప‌థ్యంలో ఇప్ప‌టికైనా అధికారులు మేలుకొని వీలైన‌న్ని ఎక్కువ ఏటీఎంలు ఏర్పాటు చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌ని చెబుతున్నారు. ఒక‌వేళ అలా చేయ‌ని ప‌క్షంలో.. ల‌క్ష‌లాది యాత్రీకులు తీవ్ర ఇబ్బందుల‌కు గురి కావ‌టం ఖాయ‌మంటున్నారు. సంప‌న్నులు వ‌చ్చే విమాన స‌ర్వీసుల గురించి నిత్యం ఉద‌ర‌గొట్టే త‌మ్ముళ్లు.. సామాన్యులు సైతం వాడే ఏటీఎం సెంట‌ర్ల ఏర్పాటు గురించి కాస్త దృష్టి పెడితే బాగుంటుంది.