Begin typing your search above and press return to search.

గర్జనపై నివేదిక ఏది...బాబు ఆగ్రహం

By:  Tupaki Desk   |   18 Feb 2019 6:00 AM GMT
గర్జనపై నివేదిక ఏది...బాబు ఆగ్రహం
X
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి - తెలుగుదేశం పార్టీ జాతీయాధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి కోపం వచ్చింది. అటు పార్టీ వారి పైన - ఇటు పోలీసులు - ఇంటెలిజెన్స్ అధికారులపైన చంద్రబాబు నాయుడు ఆగ్రహించారు. ప్రతిపక్ష వైఎస్‌ ఆర్ పార్టీ నిర్వహించిన బీసీ గర్జనపై ఎలాంటి నివేదిక ఎందుకు ఇవ్వలేదంటూ పోలీస్ మరి ఇంటేలిజెన్సీ అధికారులపై మండిపడ్డారు. బీసీ గర్జనకు ముందే ఎంతమంది వస్తారు... ఎంతమంది ప్రసంగిస్తారు.. వంటి అంశాలపై ఇంటేలిజెన్స్ విభాగం నివేదిక ఇవ్వాల్సింది. ఆ నివేదిక ఆధారంగా అటు ప్రభుత్వ పరంగాను - ఇటు పార్టీ పరంగాను చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని - ఇప్పుడు ఆ నివేదిక రాకపోవడంతో చేష్టలుడిగి చూస్తున్నామని ఇంటేలిజెన్స్ అధికారులపై మండిపడినట్లు సమాచారం. బీసీ గర్జనకు ముందు నివేదిక ఇవ్వకపోయిన గర్జన ముగిసిన తర్వాతైన అధికారులు స్పందించాలి కదా అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు.

బీసీ గర్జన ముగిసిన తర్వాత ఏ ప్రాంతం నుంచి ఎంతమంది వచ్చారు..... గర్జనకు వచ్చిన వారిలో ప్రభుత్వ వ్యతిరేకత ఎంత ఉంది... వారంతా స్వచ్చందంగా వచ్చారా... లేక డబ్బుల కోసం వచ్చారా వంటి వివరాలతో నివేదిక ఇవ్వాలని ఆ పనిని ఇప్పటికి చేపట్టకపోవడం అధికారుల నిర్లక్ష్యమేనని మండిపడినట్లు సమాచారం.

ఇక తెలుగుదేశం పార్టీ వైపు నుంచి కూడా నాయకులు సరిగా స్పందించలేదని - చంద్రబాబు నాయుడు వారిని మందలించినట్లు చెబుతున్నారు. బీసీ గర్జన ముగిసిన వెంటనే అన్ని జిల్లాలకు చెందిన తెలుగుదేశం పార్టీ బీసీ నాయకులు స్పందించాలని - ఇక్కడ అలాంటిదేమి జరగకపోవడంతో చంద్రబాబు మండిపడినట్లు చెబుతున్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిమిడి కళావెంకట్రావు ఒక బహిరంగ లేఖ రాసి చేతులు దులుపుకున్నారని.. ఇలాగేనా స్పందించడం అంటూ చంద్రబాబు మండిపడినట్లు చెబుతున్నారు. ఇప్పటికైన పార్టీ బిసీ నాయకులు జగన్ వ్యాఖ్యలని ఖండిస్తు విలేఖరుల సమావేశాలు నిర్వహించాలని - బిసీలు దూరమైతే పార్టీకి తీవ్ర నష్టం వస్తుందని గ్రహించాలని హెచ్చరించినట్లు చెబుతున్నారు.