Begin typing your search above and press return to search.
చేతకానితనానికి కోపంతో కవరింగా బాబు?
By: Tupaki Desk | 2 Sep 2018 4:55 AM GMTనా అంత తోపు దేశంలోనే లేరు. అనుభవంలో నాకు మించిన సీఎం ఎవరూ లేరంటూ తరచూ గొప్పలు చెప్పుకునే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనలో చేతకానితనం కొట్టొచ్చినట్లుగా కనిపిస్తున్న సంగతి తెలిసిందే. ఎంతో అనుభవం ఉన్నట్లుగా చెప్పే పెద్దమనిషి.. సీజనల్ వ్యాధులు విరుచుకుపడుతున్న వేళ..యుద్ధ ప్రాతిపదికన అధికారులు స్పందించేలా సిస్టంను సెట్ చేయాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది. ప్రతి వర్షాకాలంలోనూ ఉత్తరాంధ్రలో విష జ్వరాలు ప్రబలటం.. అమాయక గిరిజనులు బలికావటం చూస్తున్నదే. ఇలాంటి అనుభవాల నుంచైనా పాఠాలు నేర్చుకోవాల్సి ఉన్నా.. అదేమీ లేకుండా తన ప్రచార యావలో మునిగితేలే ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఉన్నట్లుండి విషజ్వరాల విషయం గుర్తుకు వచ్చింది.
మీడియాలో పెద్ద ఎత్తున వస్తున్న నెగిటివ్ కథనాల మీద రియాక్ట్ అయిన ఆయన వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో కలిసి అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా అధికారులపై విరుచుకుపడ్డారు. అధికారులు చెప్పే దానికి.. చేసే దానికి పొంతన ఉండటం లేదని.. గతంలో వ్యాధులు వచ్చిన చోటే మళ్లీ రావటం అంటే.. నిర్లక్ష్యమేనని.. కిందిస్థాయి నుంచి పై స్థాయి వరకూ అందరూ ఇలా వ్యవహరిస్తే ఎలా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన.. మీ నిర్లక్ష్యంతో సామాన్యలు బలి కావాలా? అంటూ మండిపడ్డారు.
ఈ మండిపాటు అంతా పత్రికల్లో కథనాలు వచ్చిన తర్వాతే కావటం గమనార్హం. తన దగ్గర అత్యాధునిక సాంకేతికత ఉందని.. ఏం జరిగినా తక్షణమే తనకు తెలుస్తుందని.. రియల్ టైం గవర్నెన్స్ లో తాను ఎప్పటికప్పుడు పరిస్థితుల్ని సమీక్షిస్తానని చెప్పే సీఎం బాబు.. విషజ్వరాలుభారీ ఎత్తున నమోదు కావటం.. వాటి కారణంగా అమాయక ప్రజలు ప్రాణాలు పోగొట్టుకుంటున్న వైనాన్ని ఎందుకంత ఆలస్యంగా గుర్తించినట్లు? అన్న ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పని పరిస్థితి. తన అసమర్థతకు.. చేతకానితనాన్ని కవర్ చేసేలా బాబు వ్యవహరిస్తున్నారన్న విమర్శ పలువరి నోట వినిపిస్తోంది.
రెండు రోజులు టైమిస్తున్నానని.. పరిస్థితిని చక్కదిద్దాలని లేదంటే తానే రంగంలోకి దిగుతానని ఆయన చెప్పటం చూస్తే.. ఆయన చేసిన తప్పును ఎంతలా కవర్ చేస్తున్నారో అర్థమవుతుందన్న మాట వినిపిస్తోంది. ఉత్తరాంధ్రలోని అన్ని జిల్లాల్లోనూ ప్రబలుతున్న వ్యాధుల నివారణకు వెంటనే చర్యలు చేపట్టాలని బాబు చెబుతున్నారు. బాబు తీరు చూస్తే.. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకున్నారన్న విషయంపై అవగాహన.. అలెర్ట్ నెస్ ఉంటే ఇలాంటి పరిస్థితి ఉండేది కాదన్న మాట వినిపిస్తోంది. బాబు అసమర్థత కారణంగానే ఇప్పుడున్న పరిస్థితి ఏర్పడిందని.. తన తప్పును కవర్ చేసుకుంటూ అధికారులపై విరుచుకుపడటం.. వార్నింగ్ లు ఇవ్వటం ఏ మాత్రం బాగోలేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.