Begin typing your search above and press return to search.
రాసే వాళ్ల మీద బాబు విరుచుకుపడ్డారా?
By: Tupaki Desk | 7 March 2016 7:00 AM GMTఅసహనం అపాయానికి చిహ్నం. సహనంతో చేయాల్సిన పనుల్ని అసహనంతో చేస్తే మొదటికే మోసం వస్తుంది. రాజకీయాల్లో విపరీతమైన అనుభవం ఉన్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు లాంటి వారికి ఇలాంటి విషయాలు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇటీవల ఏపీ రాజధాని అమరావతిలో ఏపీ అధికార పక్షానికి చెందిన నేతలు పలువురు భూదురాక్రమణకు పాల్పడ్డారంటూ భారీ కథనాల్ని సీరియల్ గా జగన్ పత్రికలో ప్రచురించటం తెలిసిందే. ఈ విషయం మీద తాజాగా చంద్రబాబు తన వాదనను వినిపించే ప్రయత్నం చేశారు.
ఈ సందర్భంగా ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు ఆసక్తికరంగా.. మరికొన్ని వ్యాఖ్యలు ఆందోళనకరంగా ఉండటం గమనార్హం. పదేళ్లు ప్రతిపక్ష నేతగా వ్యవహరించి.. 20 నెలల కిందట అధికారాన్ని చేపట్టిన ఆయన.. తమ సర్కారు మీద వెల్లువెత్తిన ఆరోపణలపై తీవ్రస్థాయిలో మండిపడటం గమనార్హం. విపక్ష నేతగా ఉన్నప్పుడు.. నాటి అధికారపక్షంపై చంద్రబాబు చాలానే ఆరోపణలు చేశారు. చేసిన విమర్శలు కూడా తక్కువేం కాదు. నాటి అధికారపక్షంపై పత్రికల్లో వచ్చిన వార్తల ఆధారంగా ఆయా ప్రభుత్వాలపై ఆయన పోరాటాలే చేశారు.
20 నెలల పాలనలో ఆయన సర్కారుపై విపక్ష నేత నేతృత్వంలో నడిచే మీడియా సంస్థ భారీ కథనాన్ని అచ్చేసింది. రాజధాని ప్రాంతంలో అధికారపక్షానికి చెందిన భూముల్ని భారీగా చేజిక్కించుకున్నారు. దీని వల్ల వేలాది కోట్ల రూపాయిల లబ్థి చేకూరిందన్నది జగన్ బ్యాచ్ ఆరోపణ సారాంశం. దీనికి సమాధానం అంతే సూటిగా.. నిరూపించాలని ప్రశ్నించటం లేదంటే.. ఏ ఆరోపణలు చేశారో దానికి బదులు ఇవ్వటం లేదంటే.. న్యాయపోరాటం చేయటం అత్యుత్తమం.
ఎవరు ఎవరిని అకారణంగా నిందించినా చట్టం తన పని తాను చేసుకుంటూ పోవచ్చు. అయితే.. మీడియాలో వచ్చే కథనాలపై పాలకుల అసంతృప్తి.. ఆగ్రహం కొత్తేం కాదు. ప్రతి ప్రభుత్వం కూడా తనపై వచ్చే విమర్శల్ని.. ఆరోపణల్ని అస్సలు సహించలేదు.. భరించలేదు కూడా. అలా అని తీవ్రస్థాయిలో విరుచుకుపడటం.. బెదిరింపులకు దిగటం సరికాదు.
బాబు తాజా వైఖరి చూస్తే.. తన మీదా.. తన సహచరుల మీద వచ్చిన ఆరోపణల్ని బలంగా తిప్పి కొట్టాలే కానీ.. తప్పుడు కథనాలు రాసే వారి మీద చర్యలు తీసుకుంటాం. వార్తలు రాసే విలేకరుల మీద ప్రాసిక్యూట్ చేస్తామని చెప్పటం అంత సబబుగా ఉండదు. హేతుబద్ధత లేని కథనాల విషయంలో చర్యలు తీసుకోవటం తప్పేం కాదు. కాకుంటే.. అది ఆచితూచి అన్నట్లు సాగాలే కానీ.. దెబ్బకు దెబ్బ అన్నట్లుగా ఉండకూడదు. తాజాగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో వార్తలు రాసే విలేకరుల మీద చేసిన వ్యాఖ్యలు కాస్తంత అభ్యంతరకరమే.
నేరం చేసే వాడికి .. రాసేవాడికి ఒకేలాంటి చట్టం వర్తిస్తుందన్నట్లుగా వ్యాఖ్యలు చేయటంతో పాటు.. వార్తలు రాసే విలేకరుల్ని ప్రాసిక్యూట్ చేస్తే.. ఒళ్లు దగ్గర పెట్టుకొని వార్తలు రాస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేయటం ఇబ్బందికరం. మీడియా ఫ్రెండ్లీగా పేరున్న చంద్రబాబు లాంటి వ్యక్తి సైతం.. మీడియా కథనాలపై అగ్గి మీద గుగ్గిలం అయిపోతే.. మిగిలిన వారి పరిస్థితి ఏంది? ఈ రోజు అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి మాటలు ఎన్ని అయినా చెప్పొచ్చు. రేపొద్దున విపక్షంలో కూర్చునే రోజు వస్తుందని.. అలాంటి సమయంలోనూ అప్పుడున్న ప్రభుత్వాలు మీడియా పట్ల కరుకుగా వ్యవహరిస్తే.. తమ పరిస్థితి ఏమిటన్న విషయం బాబు లాంటి నేతలు ఆలోచించాల్సిన అవసరం ఉంది.
అలా అని తప్పుడు రాతలు రాసే వారి విషయంలో చూసీచూడనట్లు ఉండాలని చెప్పటం లేదు. కాకుంటే.. ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలే కానీ.. మీద పడిపోయినట్లుగా మాట్లాడటం మంచిది కాదన్నది బాబు గ్రహించాలి. ఆదివారం నిర్వహించిన ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడుతూ.. మీరు రాశారని అందరిని విచారించాలా? కడిగిన ముత్యంలా.. ఆణిముత్యంలాగా ప్రభుత్వం రావాలా? ప్రభుత్వానికి ఇదే పనా? ప్రభుత్వం పని చేయొద్దా? ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని పని చేస్తుంటే.. చూస్తూ ఊరుకోవాలా? లాంటి మాటల వెనుక ఆగ్రహం విపక్ష నేత జగన్ అన్న విషయం తెలిసిందే. కానీ.. జగన్ ను తిట్టాలంటే నేరుగా తిట్టాలే కానీ.. మీడియా పేరు మీద విరుచుకుపడటం సరికాదు. ఒకవేళ తనను ఇబ్బంది పెడుతున్న వార్తల్లో నిజాలు లేకుంటే చర్యలు తీసుకోవాలే తప్పించి.. తొందరపాటుతో మీడియాపై విరుచుకుపడినట్లుగా వ్యాఖ్యలు చేయటం సరికాదన్న విషయాన్ని బాబు గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.