Begin typing your search above and press return to search.

నానిపై చంద్రబాబు ఫైర్‌..?

By:  Tupaki Desk   |   7 July 2015 10:57 PM IST
నానిపై చంద్రబాబు ఫైర్‌..?
X
చెప్పిన మాట వినకుంటే అధినేతలకు ఎంత కోపం వస్తుందన్న విషయం తాజాగా విజయవాడ ఎంపీ కేశినేని నానికి తెలిసిందని చెబుతున్నారు. ఏపీ ఎంపీలను ఉద్దేశించి జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ విరుచుకుపడటం.. నానిపై కాస్తంత ఘాటుగా స్పందించటం తెలిసిందే. దీనిపై తమ్ముళ్లు ఎదురుదాడికి దిగినా.. కేశినేని నాని కాస్త మోతాదు మించి.. పవన్‌పై వ్యక్తిగత విమర్శలు చేయటం తెలిసిందే.

పవర్‌ ఆరు నెలలకు ఓసారి నిద్రలేచి మాట్లాడితే ఎలా? తెలంగాణలో తన సినిమాలు ఆడించుకోవటనికి.. ఆస్తులు కాపాడుకోవటానికి మాట్లాడితే ఊరుకునేది లేదంటూ నాని చేసిన వ్యాఖ్యలు చంద్రబాబు దృష్టికి వెళ్లినట్లు చెబుతున్నారు. ఇలాంటి వ్యాఖ్యలు రాజకీయంగా కలిగించే నష్టం బాబుకు బాగానే తెలుసు. అందుకే.. తన మాట వినకుండా ఇష్టారాజ్యంగా మాట్లాడిన నానిపై బాబు ఆగ్రహంగా ఉన్నట్లు చెబుతున్నారు. జపాన్‌ పర్యటన నుంచి వచ్చిన తర్వాత ఆయన్ను వివరణ కోరటంతో పాటు.. ప్రత్యేక క్లాస్‌ పక్కా అన్న మాట టీడీపీ వర్గాల్లో వినిపిస్తోంది.