Begin typing your search above and press return to search.
నిజాలు రాయొద్దంటున్న చంద్రబాబు
By: Tupaki Desk | 24 Jun 2016 12:04 PM GMTమీడియాను అణగదొక్కుతున్న విషయంలో ఇప్పటికే ఆ వర్గం నుంచి వ్యతిరేకత ఎదుర్కొంటున్న ఏపీ సీఎం చంద్రబాబు తాజాగా మరోసారి తన బుద్ధి చూపించుకున్నారు. సాక్షి ఛానెల్ ప్రసారాలు రాకుండా చేయడం... ఎన్టీవీ నుంచి కొమ్మినేని శ్రీనివాసరావు వెలి వంటి అంశాలు ఇటీవల కాలంలో చంద్రబాబుకు - మీడియాకు మధ్య దూరం పెంచాయి. ఒకటిరెండు మీడియా సంస్థలు తప్ప మిగతావారిలో చాలామంది చంద్రబాబు నుంచి థ్రెట్ ఫీలవుతున్నారు. అయితే... తనకు అనుకూలంగా రాసే మీడియా సంస్థల మాదిరిగానే మిగతావారూ తనకు పూర్తిగా అనుకూలంగా రాయాలని చంద్రబాబు కోరుకుంటున్నారు. విమర్శలు - వాస్తవాలను ఏమాత్రం తట్టుకోలేకపోతున్నారు. దీంతో ఆయనలోని అసహనం బయటపడుతోంది. తాజాగా తాత్కాలిక సచివాలయ నిర్మాణంలో లోపాలు... అక్కడ ఒక ఫ్లోర్ కుంగిపోవడానికి సంబంధించి వచ్చిన కథనాలపైనా చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. అవన్నీ తప్పుడు రాతలని.. అలాంటి పరిస్థితులు లేవని చెప్పుకొస్తున్నారు.
రాజధాని భూములు - సచివాలయ తరలింపు అంశంపై మీడియాలో ఇష్టమొచ్చినట్లు వార్తలు రాస్తోందని చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘సచివాలయం కుంగిపోయిందని దుర్మార్గంగా రాశారు’ అంటూ ఆయన ఆ విస్మయాన్ని ప్రస్తావించారు. వార్తలు రాసేవారు సంయమనం పాటించాలని సూచనలు చేశారు. రాజధానిలో లక్ష కోట్ల రూపాయల అవినీతి జరుగుతోందంటూ రాశారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్ష కోట్ల అవినీతి జరిగే అవకాశం - ఆస్కారం అక్కడ ఎక్కడ ఉందని ఆయన ప్రశ్నించారు. ఇటువంటి వార్తలు రాస్తే ఇక్కడికి వచ్చే సంస్థల్లో - భూములిచ్చిన ప్రజల్లో అభద్రతా భావం కలుగుతుందని అన్నారు. అయితే... మీడియా సంయమనం పాటించాలని చెబుతున్న చంద్రబాబు మీడియా విషయంలో ఎందుకు సంయమనం పాటించడం లేదో చెప్పాలని జర్నలిస్టు సంఘాలు అంటున్నాయి. గతంలో రాజధాని శంకుస్థాపన కార్యక్రమం సందర్భంగా తనను కలిసేందుకు వచ్చిన జర్నలిస్టు సంఘాల ప్రతినిధులను ఉగ్రవాదులతో పోల్చడం వంటివి చంద్రబాబు ఎంత సంయమనంగా వ్యవహరించారో చెప్పకనే చెబుతున్నాయి.