Begin typing your search above and press return to search.

అక్ర‌మాల‌పై బాబు ఏ మాత్రం త‌గ్గ‌ర‌ట‌

By:  Tupaki Desk   |   18 Oct 2016 12:39 PM GMT
అక్ర‌మాల‌పై బాబు ఏ మాత్రం త‌గ్గ‌ర‌ట‌
X
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మ‌రోమారు మంత్రుల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఉద‌యం పార్టీ కార్యాలయంలో జ‌రిగిన టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో, అనంత‌రం త‌న అధ్యక్షతన జరిగిన కేబినెట్ స‌మావేశంలో టీం స‌భ్యుల‌పై చంద్రబాబు మండిప‌డ్డారు. పార్టీ కార్య‌క్ర‌మాల‌ను లైట్ తీసుకుంటున్నార‌ని త‌ప్పుప‌ట్టిన బాబు అదే రీతిలో ప్ర‌భుత్వంలో అక్ర‌మాల‌కు మంత్రులు అండ‌గా ఉంటున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. మ‌రోవైపు త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోయే కార్పొరేషన్ - మున్సిపల్ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా వైసీపీ గెల‌వ‌కుండా మంత్రులే బాధ్యతలు తీసుకోవాలని చంద్ర‌బాబు తేల్చిచెప్పారు.

ఉద‌యం నిర్వ‌హించిన పార్టీ కార్య‌క‌ర్త‌ల స‌మావేశంలో మంత్రులు - పార్టీ ముఖ్యనేతలు పాల్గొన్న సంద‌ర్భంగా జనచైతన్య యాత్ర - పార్టీ సభ్యత్వ నమోదుపై సమావేశంలో చర్చించారు. త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోయే శాసన మండ‌లి ఎన్నిక‌ల్లో పార్టీ విజ‌య‌కేతనం ఎగుర‌వేసేందుకు ఈ కార్య‌క్ర‌మాలు బాట‌గా మారుతాయ‌ని తెలిపారు. కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో నాయ‌కులు బాగా ప‌నిచేస్తున్న‌ప్ప‌టికీ మిగ‌తా చోట్ల లైట్ తీసుకుంటున్నార‌ని బాబు అసంతృప్తి వ్య‌క్తం చేశారు. అందుకే ఇక‌నుంచి పార్టీపై దృష్టి సారించ‌నున్న‌ట్లు తెలిపారు. అనంత‌రం జ‌రిగి ఏపీ కేబినెట్ సమావేశంలో ఇదే విష‌యాన్ని బాబు ప్ర‌స్తావించారు. జనచైతన్య యాత్రలను నేతలు ఆషామాషీగా తీసుకుంటున్నారంటూ చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే ఇసుక అక్రమ తవ్వకాలలో కొందరు నేతల పేర్లు వినిపిస్తున్నాయని స‌ద‌రు అక్రమాలలో ప్రమేయం ఉంటే ఏ స్థాయి నేతనైనా విడిచి పెట్లేది లేదని చంద్ర‌బాబు హెచ్చరించారు. ఇసుక అక్రమ తవ్వకాలపై పది రోజులలో చర్యలు ఉంటాయని చంద్రబాబు అన్నారు. అయితే అధికార పార్టీ నేత‌లు ఇసుకాసురులుగా మారిపోయార‌ని ఎప్పుటి నుంచో ప్ర‌చారం సాగుతుండ‌గా...హ‌ఠాత్తుగా ఇపుడు మంత్రుల‌ను త‌ప్ప‌ప‌ట్ట‌డం ఏమిట‌ని ప‌లువురు ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/