Begin typing your search above and press return to search.

విజయవాడలో అద్దెలపై చంద్రబాబు మండిపాటు

By:  Tupaki Desk   |   26 Jan 2016 10:29 AM GMT
విజయవాడలో అద్దెలపై చంద్రబాబు మండిపాటు
X
ఏపీ నూతన రాజధాని అమరావతికి సమీప పట్టణమైన విజయవాడలో ప్రస్తుతం అద్దెలు దద్దరిల్లుతున్నాయి. సింగిల్ బెడ్ రూం ఇల్లు కూడా రూ.10వేలకు తక్కువ చెప్పడం లేదు. డబుల్ బెడ్ రూం ఇల్లయితే రూ.15 వేల పైమాటే. ఇంకా ఓ మోస్తురు సౌకర్యాలు ఉన్న డ్యూప్లెక్సులు వంటివైతే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు... రూ.20 వేలు పైనే అద్దె అడుగుతున్నారు. హైదరాబాద్ లో కూడా లేనంత స్థాయిలో అద్దెలు చెబుతుండడంతో ఏపీ వెళ్లిపోదామనుకుంటున్న ప్రభుత్వ, ప్రయివేటు ఉద్యోగులు కూడా అక్కడి అద్దెలు చూసి భయపడుతున్నారు. దీనిపై ఇప్పటికే ఓసారి చంద్రబాబునాయుడు స్పందించగా తాజాగా మరోసారి ఆయన స్పందించారు. విజయవాడ వాసులు తాత్కాలిక లాభాలు వదులుకోకుంటే నష్టపోవడం ఖాయమని హెచ్చరించారు.

మంగళవారం విజయవాడలో మహిళలు ఏర్పాటు చేసిన ఫల, పుష్ప ప్రదర్శన కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు అక్కడ మాట్లాడుతూ... విజయవాడలో అద్దెలు ఇబ్బందికరంగా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారని అన్నారు. విజయవాడ వాళ్లు ప్రపంచమంతటా వ్యాపారాలు చేస్తున్నారని, ఇక్కడ కూడా అదే పరిస్థితి రావాలంటే కొంత స్వార్థం వీడాలని సూచించారు.

రాష్ట్రాన్ని హరితాంధ్రప్రదేశ్‌ గా తయారు చేయాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలని అన్నారు ప్రతి ఒక్కరూ తోటలు పెంచి పర్యావరణాన్నికాపాడాలని సూచించారు.