Begin typing your search above and press return to search.
రెవెన్యూ అవినీతిపై చంద్రబాబు ఫైర్
By: Tupaki Desk | 6 Jan 2016 7:38 AM GMT రెవెన్యూ శాఖ అధికారులు - సిబ్బంది పనితీరు అవినీతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు చాలా సీరియస్ గా ఉన్నారు. జన్మభూమి కార్యక్రమాల్లో ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులు - సమస్యలు తెలుసుకుంటూ ఆయన అధికారులపై మండిపడుతున్నారు. రెవెన్యూ వర్గాల కారణంగా సమస్యలు వస్తున్నట్లు గుర్తించిన ఆయన పరిస్థితి చక్కదిద్దడానికి కఠినంగా వ్యవహరించాలని డిసైడయ్యారు. తాజాగా ఆయన కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలులో నిర్వహించిన జన్మభూమి కార్యక్రమంలో గ్రామస్థాయి అధికారి అయిన వీఆర్వో నుంచి జిల్లా స్థాయిలో ఉన్న జాయింట్ కలెక్టర్ వరకు అందరినీ తీవ్రంగా హెచ్చరించారు. జేసీ చంద్రుడినైతే ఆయన సీరియస్ గా వార్నింగ్ ఇచ్చారు. ''‘తమాషాగా ఉందా? ఇదేం అడ్మినిస్ట్రేషన్? ఇక్కడ రెవెన్యూ అధికారులు ఏం చేస్తున్నారు? ఏయ్ జేసీ చంద్రుడు.. నువ్వు ఏం చేస్తున్నావ్? నేను ఎవరినీ వదిలిపెట్టను'' అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు రెవెన్యూ అధికారులపై విరుచుకుపడ్డారు.
పెనుగంచిప్రోలు గ్రామానికి చెందిన పోలేపల్లి అంజలికి సభావేదికపై పట్టాదారు పాసు పుస్తకం ఇవ్వడానికి అధికారులు ఆమెను వేదికపైకి తీసుకొచ్చారు. సీఎం ఆమెతో మాట్లాడారు. నీకు పట్టాదారు పాసు పుస్తకం ఎందుకు? అని సీఎం ప్రశ్నించడంతో పాసుబుక్ లేకపోతే మీ భూమి రికార్డుల్లో ఉండదని అధికారులు చెప్పారని, అందుకే పుస్తకం తీసుకుంటున్నామని చెప్పారు.
దీనిపై సీఎం స్పందిస్తూ.. భవిష్యత్తులో మీభూమి పోర్టల్ ద్వారా 1బీ తీసుకోవాలి, పట్టాదారు పాసుబుక్ అవసరం లేదని వివరించి... అధికారులు ప్రజలకు అవగాహన కల్పించకుండా పాస్ పుస్తకాల పేరుతో భయపెడుతుండడంతోనే జనం ఆందోళన చెందుతున్నారని మండిపడ్డారు. వేదికపైకి వీఆర్‌ఓ లావణ్యను పిలిచారు. గ్రామంలో ఎంతమందికి పట్టాదారు పాసు పుస్తకాలు ఇచ్చారని ప్రశ్నించారు. 2,008 మందికి గాను 1,474 పుస్తకాలు ఇచ్చామని చెప్పడంతో మిగిలిన వాటి సంగతి ఏంటని నిలదీశారు. వాటిలో తప్పులు ఉన్నాయని వీఆర్‌ఓ చెప్పడంతో ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో సభలో ఉన్న రైతులు కూడా పాసు పుస్తకాలు ఇవ్వడం లేదంటూ నినాదాలు చేయడంతో బాబు అధికారులపై మండిపడ్డారు. తహసీల్దార్ నాగేశ్వరరావు, జాయింట్ కలెక్టర్ గంధం చంద్రుడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతకుముందు విజయనగరం, గుంటూరు జిల్లాల్లో జరిగిన జన్మభూమి కార్యక్రమాల్లోనూ చంద్రబాబు రెవెన్యూ అధికారులను గట్టిగా హెచ్చరించారు.