Begin typing your search above and press return to search.
సోమిరెడ్డికి చంద్రబాబు క్లాస్
By: Tupaki Desk | 19 Dec 2017 5:21 AM GMTఅంకెల గారడీలో ఆరితేరిపోయిన చంద్రబాబు ముందు ఇంకెవరైనా అచ్చంగా అలాంటి ప్రయత్నమే చేస్తే సాగుతుందా... అస్సలు సాగదు. కానీ, ఏపీ వ్యవసాయ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డికి ఈ విషయం అర్థంకాలేదో, లేదంటే చంద్రబాబుకు మా నివేదికిలన్నీ చూసేంత తీరిక ఎక్కడుందనుకున్నారో కానీ తమ శాఖకు సంబంధించిన రిపోర్టులన్నీ కాకిలెక్కలేసి ఇచ్చేశారట. ఇంకేముంది.. చంద్రబాబుకు అనుమానమొచ్చి ఆరా తీస్తే అన్నీ కాకిలెక్కలేనని తేలిందట. దాంతో ఆయన సోమిరెడ్డికి స్ర్టాంగ్ వార్నింగ్ ఇచ్చినట్లు టాక్.
సోమిరెడ్డి పనితనం మాట పక్కనపెడితే నిత్యం విపక్షాలపై దుమ్మెత్తిపోసే పనిలో మాత్రం ఉంటారు. ఆ అర్హతే ఆయనకు మంత్రి పదవిని ఇచ్చింది. ఎమ్మెల్యేగా వరుసగా ఓడిపోతున్నా..పిలిచి మరీ పీఠం ఇచ్చారు చంద్రబాబు. ఎమ్మెల్సీని చేసి.. ఆ వెంటనే మంత్రిని కూడా చేశారు. ఎంతో కీలకమైన వ్యవసాయ శాఖ అప్పగించారు. కానీ.. సోమిరెడ్డి మాత్రం తన శాఖను ఏమాత్రం పట్టించుకోవడం లేదట.
రీసెంటుగా రుణమాఫీ విషయంలో తప్పుడు లెక్కలన్నీ ఇచ్చారట. దాంతో సోమిరెడ్డి పై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడో విడతలో సుమారు రూ3,600కోట్లను రుణమాఫీగా విడుదల చేయాల్సి ఉంది. కానీ ప్రభుత్వం ఇప్పటి వరకు రూ.1600కోట్లు విడుదల చేసింది. అవి బ్యాంకులకు చేరలేదు. అవి ఎందుకు చేరలేదు. ఏంటనే విషయం పై మంత్రికి అస్సలు క్లారిటీ లేదట దీంతో చంద్రబాబు ఆయనను పిలిపించి గట్టిగా క్లాసు పీకినట్లు చెబుతున్నారు.