Begin typing your search above and press return to search.

వాళ్ల‌ను చూస్తే చంద్ర‌బాబుకు మండిపోతోంది

By:  Tupaki Desk   |   21 July 2016 7:27 AM GMT
వాళ్ల‌ను చూస్తే చంద్ర‌బాబుకు మండిపోతోంది
X
తెలుగుదేశం పార్టీ అధినేత‌ - సీఎం చంద్రబాబు నాయుడుకు త‌న పార్టీలోనే కొంద‌రు ఎమ్మెల్యేలు - నియోజ‌క‌వ‌ర్గ ఇంఛార్జిలను చూస్తే కోపం క‌ట్ట‌లు తెంచుకుంటోంద‌ట‌. ఎన్ని నిధులిచ్చినా - ఎన్ని సార్లు చెప్పినా వారు నియోజ‌క‌వ‌ర్గాల్లో తిర‌గ‌కుండా - ప‌నులు చేయ‌కుండా - ప్ర‌జ‌ల్లోకి వెళ్ల‌కుండా నిర్ల‌క్ష్యంగా ఉంటున్నార‌న్న‌ది ఆయ‌న కోపం. తాజాగా ఆయ‌న త‌న కోపాన్ని పార్టీ సీనియ‌ర్ నేత‌ల ముందు కూడా వెల్ల‌గ‌క్కారు. పార్టీ అభివృద్ధికి ఇటీవల నియమించిన పదిమంది సభ్యులతో చంద్రబాబు బుధవారం భేటీ అయిన‌ప్పుడు చ‌ర్చంతా ఎక్కువ‌గా ఎమ్మెల్యేల ప‌నితీరుపైనే సాగింది. ఎమ్మెల్యేల ప‌నితీరుపై చంద్ర‌బాబు తీవ్ర అసంతృప్తి - అస‌హ‌నం క‌న‌బ‌రిచార‌ని చెబుతున్నారు.

ఎమ్మెల్యేల పనితీరుపై ముఖ్యమంత్రి ఇటీవల జరిపించిన సర్వేల వివరాలు ఈ భేటీలో చ‌ర్చ‌కొచ్చాయి. కనిష్టంగా ఒక ఎమ్మెల్యేకు 17 మార్కులు వస్తే, గరిష్ఠంగా మరో ఎమ్మెల్యేకు 74 మార్కులు వచ్చాయి. 20 నుంచి 30 శాతం మార్కులు వచ్చిన వారు కూడా చాలా తక్కువ మంది ఉన్నారు. ‘ప్రజాసంక్షేమం కోసం ప్రభుత్వం అనేక పథకాలను ప్రవేశపెడుతోంది. ఇవి అన్ని నియోజకవర్గాలకు సమానంగానే అందుతున్నాయని, అటువంటప్పుడు ఎమ్మెల్యేలపై ఎందుకు ప్రజలు అసంతృప్తితో ఉన్నార’ని చంద్ర‌బాబు ప్రశ్నించారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో ఎమ్మెల్యేలు విఫలమయ్యారని చంద్రబాబు సీరియ‌స్ అయ్యార‌ట‌.

ముఖ్యంగా కాపుల విష‌యంలో ఆయ‌న ఆ సామాజిక‌వర్గ నేత‌ల ఫెయిల్యూర్ పై మండిప‌డిన‌ట్లు తెలిసింది. కాపులకు గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా తమ ప్రభుత్వం పెద్ద పీట వేస్తే - దాన్ని పార్టీ వర్గాలు ప్రజల్లోకి తీసుకువెళ్లలేకపోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నిత్యం ప్రజల్లో ఉండమని తను పదే పదే ఎమ్మెల్యేలకు - పార్టీ నాయకులకు చెపుతున్నా - వారు పెడచెవిన పెట్టారని అందుకే ప్రజల్లో వారి పట్ల సంతృప్తి లేదని చంద్రబాబు ఫైర్ అయ్యారు. కాగా ఇప్ప‌టికే ప‌లుమార్లు ఈ విష‌యంలో సీరియ‌స్ అయిన చంద్ర‌బాబు ఈసారి వ్య‌క్తిగ‌తంగా కౌన్సిలింగ్ చేస్తార‌ని తెలుస్తోంది.