Begin typing your search above and press return to search.
టీడీపీ సమన్వయ భేటీ: అంతా హాట్ హాట్
By: Tupaki Desk | 10 Oct 2017 12:53 PM GMTటీడీపీ సమన్వయ కమిటీ భేటీ అదిరిపోయింది. ఇటీవల కాలంలో టీడీపీ నేతలు వ్యవహరించిన తీరుపై ఆ పార్టీ అధినేత - సీఎం చంద్రబాబు రెచ్చిపోయారు. నేతలపై ఫైరయ్యారు. ఇలాగైతే.. మన పార్టీ వచ్చే సారి అధికారంలోకి రావడం కల్లే.. అంటూ తేల్చి చెప్పారు. అంతేకాదు, ఇటీవల పవన్ కల్యాణ్ ను ఉద్దేశించి కొందరు నేతలు చేసిన కామెంట్లపైనా బాబు ఫైరయ్యారు. పార్టీ పరువు తీస్తున్నారని మండిపడ్డారు. విషయంలోకి వెళ్తే.. టీడీపీ రాష్ట్రస్థాయి సమన్వయ కమిటీ సమావేశం మంగళవారం వాడీవేడిగా జరిగింది. చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలు అంశాలు చర్చకు వచ్చాయి.
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పై విమర్శలు చేసిన మంత్రి పితాని సత్యనారాయణను చంద్రబాబు మందలించినట్టు తెలిసింది. పవన్ పై అలాంటి వ్యాఖ్యలు చేయొద్దని పితానిని హెచ్చరించినట్టు సమాచారం. పవన్ టీడీపీకి మిత్రపక్షమని, కాబట్టి ఆయన గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలని, అనవసర వ్యాఖ్యలు చేయకూడదని చంద్రబాబు టీడీపీ నేతలకు హితబోధ చేసినట్టు సమాచారం. అదేవిధంగా వైసీపీ వ్యవహారంపైనా బాబు రియాక్ట్ అయినట్టు తెలిసింది. విజయవాడలో ఇటీవల ప్రారంభించిన వైసీపీ కార్యాలయంపై బాబు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. విజయవాడలో అధికార టీడీపీ రాష్ట్ర కార్యాలయం ఏర్పాటు చేయకపోవడంపై మంత్రి దేవినేని ఉమాపై బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇక, మంత్రి పరిటాల సునీత తనయుడు శ్రీరామ్ పెళ్లికి తెలంగాణ సీఎం కేసీఆర్ వచ్చిన తెలుగు దేశం పార్టీ నేతలు అతిగా ఆయనతో చనువు ప్రదర్శించారని కూడా సీఎం అన్నారు. `మనవాళ్లు అతిగా ప్రవర్తించారు` అంటూ చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. తన కన్నా కేసీఆర్ కే టీడీపీ నేతలు ప్రాధాన్యం ఇచ్చారని, ఇలాగైతే.. పార్టీ పరువు ఏం కానని అన్నారు. ఇక, రెండు రాష్ట్రాల్లోనూ అత్యధిక ప్రాధాన్యం సంతరించుకున్న పయ్యావుల కేశవ్ - సీఎం కేసీఆర్ ల భేటీపై బాబు మరింత అసహనం వ్యక్తం చేశారు. ఎందుకీ రహస్య మంతనాలు, మన రాష్ట్రానికి సంబంధం లేని నేత, మనకు వైరి వర్గ నేత, మనం నాశనం అయిపోవాలని కోరుతున్న నేత కేసీఆర్ తో ఎందుకీ మంతనాలు? అని ఘాటుగా ప్రశ్నించినట్టు సమచారం. ఇలాంటి విషయాల్లో జాగ్రత్తాగా ఉంటే మంచిదని కూడా బాబు హెచ్చరించినట్టు సమాచారం. మొత్తానికి సమన్వయ కమిటీ సమావేశం అదిరింది గురూ!! అన్నారు బయటకు వచ్చిన నేతలు!