Begin typing your search above and press return to search.
ఆ సీసీ కెమేరా ఫుటేజ్ సంపాదించలేకపోయారే?
By: Tupaki Desk | 22 Dec 2015 5:27 AM GMTఏపీ ముఖ్యమంత్రి సీరియస్ అయ్యారు. అది కూడా అలా.. ఇలా కాకుండా ఓ రేంజ్ లో పార్టీ నేతలపై మండిపడ్డారు. పార్టీ ప్రతిష్ఠను గంగలో కలిపేసేలా వ్యవహరిస్తూ.. పార్టీని బలిపశువు చేస్తున్నారే అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అందరిని తాను గమనిస్తున్నానని.. పార్టీ నాలుగు కాలాల పాటు రాజకీయాల్లో నిలదొక్కుకునేలా పని చేయాలని.. ‘‘మీ వల్ల పార్టీ బలపడాలి. అంతేకానీ నష్టపోకూడదు. మీ వల్ల పార్టీ నష్టపోతుంటే.. నేను చేయాల్సింది నేను చేస్తా. నా నిర్ణయం నేను తీసుకుంటా’’ అంటూ హెచ్చరించటం పార్టీలో కలకలం రేపుతోంది.
సోమవారం శాసన మండలిలో పార్టీ నేతల తీరును తప్పు పట్టి.. తన వారినైనా వదులుకోవటానికి తాను సిద్ధమేనని ప్రకటించిన అనంతరం.. ఆయన పార్టీకి చెందిన ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తప్పు ఉందంటూ వనజాక్షి విషయంపై మాట్లాడారు. ఇది జరిగిన కాసేపటికి శాసనసభాపక్ష సమావేశాన్ని అసెంబ్లీలో నిర్వహించిన చంద్రబాబు పార్టీ నేతల మీద నిప్పులు చిమ్మారు.
ఈ సందర్భంగా పార్టీ నేతల చేతకానితనాన్ని ఉదాహరణలతో సహా ప్రస్తావించటం గమనార్హం. తిరుపతి రేణిగుంట విమానాశ్రయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేత ఒకరు ఎయిర్ పోర్ట్ అధికారిని కొడితే.. దాని సీసీ కెమెరా పుటేజ్ తీసుకురాలేకపోయారన్నారు. తన గురించి.. ఒక దళిత ఎమ్మెల్యే గురించి వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు నోటికి వచ్చినట్లు దూషిస్తే.. వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోయారని.. అదే పని మీలో ఎవరైనా చేసి ఉంటే అవతలి పక్షం దానిని ఎలా ప్రచారం చేసేదో ఎప్పుడైనా ఆలోచించారా? అని ప్రశ్నించారు.
‘‘అన్నీ నేనే మాట్లాడాలా? మీకు ఎవరికీ బాధ్యత లేదా?’’ అంటూ పార్టీ నేతల మీద తీవ్రంగా విరుచుకుపడిన బాబు.. కొందరు మంత్రులు పార్టీకి అతీతంగా వ్యవహరిస్తున్నారని.. ఇలాంటి ధోరణి తక్షణమే విడనాడాలన్నారు. కొందరు మంత్రులు పార్టీతో సంబంధం లేనట్లు వ్యవహరిస్తున్నారని.. అసలు పార్టీనే లేకుండా మీకు పదవులు ఎక్కడి నుంచి వస్తాయి? అని వ్యాఖ్యానించారు. మంత్రులు జిల్లాలకు వెళితే.. పార్టీ కార్యాలయాలకు వెళ్లాలని.. కార్యకర్తల అవసరాల్ని పట్టించుకోవాలని.. అలాంటి విషయాల్లో పట్టనట్లు వ్యవహరిస్తే ఊరుకోనని తేల్చి చెప్పారు. మొత్తానికి బాబు ఆగ్రహం చూస్తేంటు.. త్వరలో ఆయన భారీ నిర్ణయాలు తీసుకునేందుకు సిద్ధమైనట్లుగా కనిపిస్తోంది.