Begin typing your search above and press return to search.
పార్టీ నేతలకు బాబు భారీ వార్నింగ్
By: Tupaki Desk | 25 Jan 2017 10:40 AM GMTచూసీ చూడనట్లుగా పోవటం.. అందరిని సంతృప్తిపర్చటమే థ్యేయంగా ముందుకెళుతున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పుడు అగ్గి ఫైర్ అవుతున్నారట. నిన్నటివరకూ తెలుగు తమ్ముళ్ల తీరు ఎలా ఉన్నా పెద్దగా పట్టనట్లుగా వ్యవహరించిన ఆయన.. తాజాగా నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో అగ్గి ఫైర్ అయినట్లుగా చెబుతున్నారు. తమ్ముళ్ల పని తీరు ఏమాత్రం బాగోలేదంటూ పలు ఉదాహరణల్ని ఆయన చెప్పుకొచ్చారట.
ముఖ్యంగా వంశధార ప్రాజెక్టు విషయంలో ఆర్నెల్ల క్రితం అనుమతులు ఇస్తే.. వాటి అమలు గురించి నేతలు పట్టించుకోకపోవటం.. చివరకు వాటిపై రైతులు ఆందోళనలకు దిగి.. హింసాత్మక సంఘటనలు చోటుచేసుకునే వరకూ ఏం చేస్తున్నారంటూ శ్రీకాకుళం జిల్లా నేతలపై తీవ్రస్థాయిలో మండిపడినట్లుగా తెలుస్తోంది. పార్టీలో చోటు చేసుకుంటున్న అపసవ్య పరిస్థితులపై తీవ్ర ఆందోళనవ్యక్తం చేయటమే కాదు.. తోక జాడించే వారి విషయంలో కత్తెరకు పని చెబుతానని కూడా ఓపెన్ గా చెప్పేశారట.
అధికారంలో ఉన్నప్పుడు మరింత బాధ్యతగా ఉండాల్సింది పోయి.. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని.. ఇష్టారాజ్యంగా చేస్తున్నపనుల గురించి ప్రస్తావించటమే కాదు.. పార్టీని.. ప్రభుత్వాన్ని ఇబ్బందికి గురి చేసే ఘటనల గురించి ప్రస్తావించిన మరీ ఫైర్ అయినట్లుగా తెలుస్తోంది. వారం వ్యవధిలో తాను సంచలన నిర్ణయాల్ని తీసుకోనున్నానని.. ఇకపై తాను కరకుగానే ఉంటానని చెప్పినట్లుగా చెబుతున్నారు. ఈ మధ్య కాలంలో బాబు ఇంత ఆగ్రహంతో ఉండటం తాము చూడలేదని నేతలు చెబుతున్నారు.
తమిళనాడులోని జల్లికట్టు ఉద్యమం జరుగుతున్న వేళ.. ఏపీలోకూడా హోదా అంశంపై ఉద్యమం జరిగే అవకాశం ఉందని తాను ముందే ఊహించానని.. అయితే..జల్లికట్టుకు.. హోదాకు పోలిక లేదని చెప్పినట్లుగా తెలుస్తోంది. ప్రత్యేక హోదాకు.. ప్రత్యేక ప్యాకేజీకి మధ్య తేడా లేదని.. హోదా వస్తే ఏం వస్తుందో.. అవన్నీ కేంద్రం ఇచ్చినట్లుగా ఆయన చెప్పినట్లు చెబుతున్నారు. గడిచిన రెండున్నరేళ్లుగా పాలనపై ఫోకస్ చేసి.. అధికారుల తీరును ఒక క్రమపద్ధతిలో పెట్టినట్లు చెప్పిన చంద్రబాబు.. ఇకపై పార్టీకి మరింత సమయాన్ని కేటాయించనున్నట్లుగా వెల్లడించారు. ఏమైనా.. తమ్ముళ్లపై బాబు మండిపాటు పార్టీలో ఇప్పుడు సంచలనంగా మారింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/