Begin typing your search above and press return to search.
అంతా చూస్తున్నారు..రహస్యభేటీలు వద్దు
By: Tupaki Desk | 28 March 2018 5:45 AM GMTతెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పార్టీ ఎంపీలతో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. పార్టీ ఎంపీలతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో చంద్రబాబు ఎంపీలకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ... వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి బయటపెట్టిన అంశంపై హెచ్చరికలు జారీచేశారు. విజయసాయిరెడ్డి పార్లమెంటు వద్ద మాట్లాడుతూ అందితే కాళ్ళు, అందకపోతే జుట్టు అన్నట్టు వ్యవహరించేది చంద్రబాబు, ఆయన ఎంపీలు, ఎమ్మెల్యేలని ఎద్దేవా చేశారు. ఇద్దరు నేరగాళ్లు సుజనా, సీఎం రమేష్ కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ని ఎందుకు కలిశారని ఆయన ప్రశ్నించారు. ఇలాంటి దొంగల పార్టీ వైసీపీ మీద ఆరోపణలు చేస్తుందా అని ఆయన ప్రశ్నించారు.
విజయసాయిరెడ్డి సూటిగా ప్రశ్నించిన నేపథ్యంలో చంద్రబాబు తన ఎంపీలను హెచ్చరించారు. పలువురు ఎంపీలు కేంద్ర మంత్రులతో రహస్య భేటీలు నిర్వహించడంపై వ్యతిరేకత వస్తుందని తెలిపారు. పార్టీ ప్రతిష్ఠను దెబ్బతీసే చర్యలను సహించబోనని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. అప్రమత్తంగా ఉండాలని, అందరూ గమనిస్తున్నారని చెప్పిన చంద్రబాబు రహస్యంగా ఎవరితో మంతనాలు జరపవద్దన్నారు. ఎవరికీ సొంత అజెండాలు ఉండకూడదని.. తెలిసి చేసినా, తెలియక చేసినా తప్పుతప్పే అవుతుందని హెచ్చరించారు. కాగా, బాబు వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పుడు బాబు జాగ్రత్తగా ఉండాలని, అంతా చూస్తున్నారని పేర్కొనడం వెనుక ఇన్నాళ్లు జరిగిన ఇదే తరహా సమావేశాలను బాబు పక్కనపెట్టేశారా అంటూ పలువురు సందేహం వ్యక్తం అవుతున్నాయి. ఇప్పుడు అందరి చూపు టీడీపీ ఎంపీలపై పడటం వల్లనే అలాంటివి పక్కనపెట్టేశారా?సాక్షాత్తు బాబు మాటల వెనుక ఇదే అర్థం ధ్వనిస్తోంది అని వారు వ్యాఖ్యానిస్తున్నారు.
ఇదిలాఉండగా....వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై చంద్రబాబు విరుచుకుపడ్డారు. విజయసాయి వ్యాఖ్యలు గర్హనీయమన్నారు. చనిపోయిన తన తల్లిదండ్రులపై వ్యాఖ్యలు చేయడం భారతీయ సంప్రదాయం అవుతుందా? అని బాబు ఆవేదన వ్యక్తం చేశారు. విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు దుర్మార్గానికి పరాకాష్ట అని.. అలాంటి వాళ్లను ప్రధాని కార్యాలయం చేరదీస్తోందని దుయ్యబట్టారు. ఆయనపై గట్టిగా ఎదురుదాడి చేయాలన్నారు. ఢిల్లీ వచ్చిన తెలుగువారికి సహకరించడం ఎంపీల బాధ్యత అని ఈ విషయంలో కొందరు నిర్లక్ష్యం సరికాదని బాబు తప్పుపట్టారు.